Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC ఛైర్మన్‌గా జై షా ముందున్న సవాళ్లు ఇవే.!

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నూతన ఛైర్మన్‌గా జై షా నియమితులయ్యారు. ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీగా ఉన్న జై షా.. డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది.

ఐసీసీ ఛైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేసేందుకు నేడే(మంగళవారం) ఆఖరి రోజు కాగా.. జై షా రేసులో నిలవడంతో మరెవరూ పోటీ చేయడానికి ముందుకురాలేదు. దాంతో జై షా ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా చరిత్ర సృష్టించాడు. 35 ఏళ్ల వయసులోనే అతను ఈ అత్యున్నత పదవిని స్వీకరించడం గమనార్హం.

Jay Shah Challenges Await New ICC Chairman

ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపికైన ఐదో భారతీయుడిగా జైషా నిలిచాడు. జగన్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్‌ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్‌లు భారత్ నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికైన జై షా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఐసీసీ స్టేక్ హోల్డర్స్‌‌కు అనుగుణంగా నడుచుకుంటూ క్రికెట్ అభివృద్దికి పాటుపడాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని విజయవంతంగా నిర్వహించడం జై షాకు అతిపెద్ద సవాల్. బీసీసీఐ సెక్రటరీగా టీమిండియాను పాకిస్థాన్‌కు పంపించేందుకు నిరాకరించిన జై షా..ఇప్పుడు అలా దూకుడుగా వ్యవహరించలేని పరిస్థితి. మరోవైపు టీమిండియా.. పాకిస్థాన్‌లో పర్యటించాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతివ్వాలి.

గతంలో ఆసియా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ఛైర్మన్‌గా ఆసియాకప్ నిర్వహణ విషయంలో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న జై షా.. హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీ నిర్వహించాడు. భారత్ మ్యాచ్‌లను తటస్థ వేదికగా జరిపారు. ఇప్పుడు కూడా భారత్ అదే డిమాండ్ చేస్తోంది.

మరో అతిపెద్ద సవాల్ టెస్ట్ క్రికెట్‌ను కాపాడటంతో పాటు మరింత అభివృద్ధి చేయడం. టీ20లు రాజ్యమేలుతున్న ప్రస్తుత కాలంలో టెస్ట్ క్రికెట్ ఆదరణ పెంచడం.. కుర్రాళ్లు సుదీర్ఘ ఫార్మాట్ ఆడేలా ప్రోత్సహించడం జై షా ముందున్న కర్తవ్యం. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఫ్రాంచైజీ లీగ్స్‌లో అంతర్జాతీయ క్రికెటర్లు ఆడకుండా నివారించడం కూడా జై షా ముందున్న అతిపెద్ద సవాల్.

అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌ సమతూకంగా ఉండేలా చూసుకోవడం, ఆటగాళ్లకు తగిన విశ్రాంతి ఉండేలా షెడ్యూల్‌ను రూపొందించడం కూడా జై షాకు సవాల్‌తో కూడుకున్న పనే. అంతేకాకుండా లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028లో క్రికెట్ భాగమయ్యేలా కృషి చేయడం, క్రికెట్‌ను మరిన్ని దేశాలకు విస్తరించడం జై షా ముందున్న అతిపెద్ద టాస్క్.

Story first published: Tuesday, August 27, 2024, 22:38 [IST]
Other articles published on Aug 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+