భారత ఆటగాళ్లతో హోలీ ఆడాం.. రవిశాస్త్రిని పూల్‌లో తోసేశాం: మియాందాద్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ బుధవారం ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. 1987లో ఇండియా టూర్‌కు వచ్చిన పాకిస్థాన్ క్రికెటర్లు భారత ఆటగాళ్లతో కలిసి హోలీ ఆడినట్లు వెల్లడించాడు. ఓ యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ మధురమైన ఈ పాత జ్ఞాపకాన్ని నెమరేసుకున్నాడు.

హోలీ ఆడాం..
‘బెంగళూరులో టెస్టు సందర్భంగా భారత్-పాక్ ఆటగాళ్లు ఒకే హోటల్‌లో స్టే చేశాం. సాయంత్రం మేమంతా ఒకే చోట చేరి సరదాగా మాట్లాడుకునే వాళ్లం. అది హోలీ సీజన్ కావడంతో హోటల్‌లోని వారంతా హోలీ ఆడేవారు. నాకు ఇంకా గుర్తుంది. మేమంతా కలిసి ఇమ్రాన్‌ఖాన్ రూంలోకి వెళ్లి రంగులు చల్లుకున్నాం. భారత క్రికెటర్లను కూడా మేము వదల్లేదు. వారు కూడా మాకు ఎలాంటి అడ్డు చెప్పలేదు' అని ఈ పాక్ లెజండరీ బ్యాట్స్‌మన్ గుర్తు చేసుకున్నాడు.
రూంలో దాక్కున్న రవిశాస్త్రిని..
అప్పటి టీమిండియా ప్లేయరైన, ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి రూంలో దాక్కొన్న విషయాన్ని గుర్తించి అతన్ని స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేశామని మియాందాద్ చెప్పుకొచ్చాడు.
‘రవిశాస్త్రి ఓ రూంలో దాక్కొన్న విషయాన్ని గుర్తించి మేమంతా అతడ్ని మోసుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో తోసేశాం. ఆ టూర్‌ను చాలా బాగా ఎంజాయ్ చేశాం. పాకిస్థాన్ క్రికెటర్లకు అది ఎప్పటికీ బెస్ట్ టూర్‌గా మిగిలిపోతుంది. ప్రతి ఒక్కరూ ఇతర మతాల పండగల్లో పాలు పంచుకోవాలి. హోలీ పండగను మేమంతా కలిసి చేసుకున్నాం. ఒకరి పండగల్లో మరొకరు పాలుపంచుకోవడంలో తప్పులేదు' అని ఈ లెజెండరీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు.

భారత్ ఓటమి..
1987లో బెంగళూరు వేదికగా జరిగిన ఈ లో స్కోరింగ్ టెస్ట్‌లో భారత్ 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇది భారత లెజెండ్ సునీల్ గావస్కర్‌కు చివరి టెస్ట్ మ్యాచ్. విజయం కోసం ఈ లిటిల్ మాస్టర్(96) ఒంటరి పోరాటం చేశాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 116 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మణిందర్ సింగ్ ( 7/28) పాక్ పతనాన్ని శాసించాడు. అనంతరం భారత్ కూడా 145 పరుగులకే కుప్పకూలింది. దిలీప్ వెంగ్‌సర్కార్(50) మినహా అంతా విఫలమయ్యారు. తర్వాత పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 204 పరుగులకే పరిమితమై గెలుపు ముంగిట చేతులెత్తేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications