'మన్కడింగ్' చేయడంలో తప్పులేదు: జవగళ్ శ్రీనాథ్

న్యూఢిల్లీ: గత ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన 'మన్కడింగ్' పెద్ద దుమారమే రేపింది. మన్కడింగ్ ద్వారా నాటి రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను ఔట్ చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమని దుమ్మెత్తిపోశారు. అయితే తాను నిబంధనల ప్రకారమే చేశానని అశ్విన్ తన చర్య సమర్ధించుకున్నాడు. ఇక ఈసారి వేలంలో పంజాబ్ ప్రాంచైజీ అశ్విన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వదులుకుంది. ఢిల్లీ హెడ్ కోచ్‌గా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యవహరిస్తున్నాడు.

మన్కడింగ్ సరైందే..
అయితే ఈసారి అశ్విన్ మన్కడింగ్‌కు పాల్పడకుండా గట్టిగా వారిస్తానని, క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉండే ఈ చర్యను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించని ఇటీవల పాంటింగ్ హామీ ఇచ్చాడు. దీంతో ఈ మన్కడింగ్ వ్యవహారంపై మరోసారి చర్చ జరిగింది. అశ్విన్ కూడా దీనిపై వివరణ ఇచ్చాడు. ఇక తాజాగా ఈ అంశంపై మాట్లాడిన భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ మన్కడింగ్ చేయడం సరైందేనని అభిప్రాయపడ్డాడు.
బంతి వేయకముందే క్రీజును వీడే నాన్‌స్ట్రైక్ బ్యాట్స్‌మన్‌ను మన్కడింగ్ (రనౌట్) చేయడంలో తప్పేమీ లేదని ఈ ఐసీసీ మ్యాచ్ రిఫరీ స్పష్టం చేశాడు. ఇందులో క్రీడాస్ఫూర్తికి చోటు లేదన్నాడు. ఆ బ్యాట్స్‌మన్‌పై సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. 'డీఆర్‌ఎస్ విత్ యాష్' కార్యక్రమంలో శ్రీనాథ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

క్రీడాస్పూర్తి ఎందుకు..?
‘బౌలర్ ప్రధాన బ్యాట్స్‌మన్‌పై దృష్టి పెడతాడు. అలాంటప్పుడు బంతి వేసేంత వరకు నాన్ స్ట్రైకర్ క్రీజులోనే ఉండాలి. అదేం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే అతడు బ్యాటింగ్ చేయడం లేదు. మరోదాని గురించి ఆలోచన లేదు. కానీ అతడు క్రీజు దాటి ప్రయోజనం పొందుతున్నప్పుడు అలా రనౌట్ చేస్తే తప్పేం లేదు. ఇందులో క్రీడాస్ఫూర్తిని తీసుకురావొద్దు. బ్యాట్స్‌మన్ క్రీజులోనే ఉండాలన్న దానికే నేను కట్టుబడతాను' అని ఆయన పేర్కొన్నాడు.

బౌలర్‌కు నష్టం..
నాన్‌స్ట్రైకర్ క్రీజు దాటడం వల్ల మ్యాచ్‌లు మలుపులు తిరుగుతాయని శ్రీనాథ్ చెప్పారు. ‘క్రీజు దాటడం వల్ల బ్యాటింగ్ చేసే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది. అప్పటికే సగం దూరం పరిగెత్తితే రనౌట్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇలాంటి చర్యల వల్ల మరో జట్టుకు నష్టం వాటిల్లుతుంది. ప్రతీ బంతికి ప్రయోజనం ఉంటుందని అనుకోలేం. కానీ ఆఖరి బంతికి ఒక పరుగు చేస్తే విజయం లభించే సందర్భాల్లో మాత్రం సమన్యాయం ఉండదు'శ్రీనాథ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications