For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘బాబీ బరువెక్కారు’.. దిమ్మతిరిగే బదులిచ్చిన బుమ్రా సతీమణి!

తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన ఓ నెటిజన్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సతీమణి సంజన గణేశన్ దిమ్మతిరిగే బదులిచ్చారు. మరోసారి ఇలా ఆకతాయి కామెంట్స్ చేయకుండా గట్టిగా బుద్ది చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.

జస్‌ప్రీత్ బుమ్రా సోషల్ మీడియా వేదికగా సోమవారం ఓ ప్రమోషనల్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో బుమ్రాతో పాటు అతని సతీమని సంజన గణేశన్ సైతం కనిపించారు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె కాస్త బరువెక్కారు. దాంతో ఓ నెటిజన్ 'బాబీ బరువెక్కారు'అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు చిర్రెత్తుకుపోయిన సంజన గణేశన్.. సదరు నెటిజన్‌కు క్లాస్ పీకారు.

Jasprit Bumrahs Wife Sanjana Ganesan Fat-Shamed On Social Media, Hits Back With Stunning Replay

'నీ స్కూల్‌లో సైన్స్ బుక్స్‌లో నుంచి నువ్వు ఏం నేర్చుకోలేదు. పైగా మహిళల శరీరాల గురించి నీ జ్ఞానాన్ని ప్రదర్శించేందుకు వచ్చావు. అన్నీ మూస్కోని ఇక్కడి నుంచి దొబ్బేయ్'అని హిందీలో బదులిచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. సంజన గణేశన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళలు బరువెక్కడం సహజం. చిన్న చిన్న వ్యాయామాలతో వాళ్లు మళ్లీ మాములు బరువుకు రావచ్చు. ఇది తెలుసుకోకుండా సదరు నెటిజన్ సంజన గణేశన్‌ను కామెంట్ చేసి నవ్వుల పాలయ్యాడని ఇతర నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సరదా కోసం చేసిన కామెంట్.. మిస్ ఫైర్ అయ్యిందని మరికొందరు అంటున్నారు.

జస్‌ప్రీత్ బుమ్రా, సంజన గణేశన్‌‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్టార్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ అయిన సంజన గణేషన్.. టీమిండియా స్టార్ ప్లేయర్ అయిన బుమ్రాల పరిచయం కాస్త ప్రేమగా మారి 2021 మార్చి 15న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గతేడాది సెప్టెంబర్4న వీరికి ఓ బాబు జన్మించాడు. అతనికి అంగద్ జస్‌ప్రీత్ బుమ్రా‌గా పేరు పెట్టారు.

ప్రస్తుతం బుమ్రా.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ ఆడుతున్నాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. హైదరాబాద్ టెస్ట్‌లో 6, వైజాగ్ టెస్ట్‌లో 9 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Tuesday, February 13, 2024, 9:51 [IST]
Other articles published on Feb 13, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+