వెస్టిండీస్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో జస్‌ప్రీత్ బుమ్రాను ఆడించే విషయంపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్‌కు ముందే బుమ్రాను ఆడించే విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. వర్క్‌లోడ్ నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ పర్యటనలో మూడు టెస్ట్‌లు మాత్రమే ఆడిన విషయం తెలిసిందే.
ఆసియా కప్ 2025 టోర్నీలోనూ కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి కల్పించారు. ఆసియా కప్ 2025 ముగిసిన రెండు రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్‌తో సిరీస్ ప్రారంభం కానుండటంతో బుమ్రా ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. గురువారం నుంచి అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న శుభ్‌మన్ గిల్ బుమ్రా వర్క్‌లోడ్‌పై స్పందించాడు.

'మేం మ్యాచ్‌లు జరుగుతున్న కొద్దీ బుమ్రా విషయమై నిర్ణయం తీసుకుంటాం. ఆట ఎన్ని ఓవర్ల వరకు వెళ్తుంది. బౌలర్లు ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేశారు అనేదాని బట్టి ఓ నిర్ణయానికి వస్తాం.'అని గిల్ సమాధానమిచ్చాడు.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ నేపథ్యంలో బుమ్రా 25 నుంచి 26 ఓవర్లపాటు బౌలింగ్ చేస్తాడని, అలాగే ప్రతీ మ్యాచ్ ముందు ఉత్తమ జట్టును ఎంపిక చేస్తామని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డెన్ డస్కాటే తెలిపాడు. టీమిండియా అత్యుత్తమ జట్టులో బుమ్రా ఉంటాడని స్పష్టం చేశాడు.
భారత్ :
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్-కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్.
వెస్టిండీస్ :
రోస్టన్ చేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్, కెవ్లోన్ ఆండర్సన్, అలిక్ అథానాజ్, జాన్ క్యాంప్‌బెల్, టేగ్‌నరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియరీ, జేడెన్ సీల్స్.