For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మార్చి 14న జస్ప్రీత్ బుమ్రా వివాహం.. ఎవరీ సంజనా గణేషన్?

Jasprit Bumrah will be marrying Sanjana Ganeshan on 14th March in Goa
#JaspritBumrah To Marry #SanjanaGanesan In #Goa This Weekend || Oneindia Telugu

గుజరాత్‌: టీమిండియా స్టార్ పేసర్, స్పీడ్‌స్ట‌ర్ జస్ప్రీత్ బుమ్రా.. తన సొంతూరు గుజరాత్‌లో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవ‌ర‌నే దానిపై చాలా రోజులుగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ నడిచింది. స్టార్ హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో బుమ్రా వివాహం జ‌ర‌గ‌నుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జరిగింది. అవన్నీ గాలి వార్తలే అని అటు అనుపమ తల్లి, ఇటు బుమ్రా తల్లి క్లారిటీ ఇచ్చారు. తాజాగా బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనే దానిపై స్పష్టత వచ్చింది. అంతేకాదు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది.

 సంజనాతో బుమ్రా పెళ్లి:

సంజనాతో బుమ్రా పెళ్లి:

ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సంజనా గణేషన్‌ను జస్ప్రీత్ బుమ్రా పెళ్లాడబోతున్నాడు. మార్చి 14 నుంచి 15 వరకు గోవాలో బుమ్రా, సంజన వివాహం చేసుకోనున్నారు. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో బుమ్రా పెళ్లి జరగుతుందట. ఈ కార్యక్రమానికి బుమ్రా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారట. అయితే పెళ్లి తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుక నిర్వహించే అవకాశం కూడా ఉంది. దీనికి సహచర ఆటగాళ్లతో పాటు అతిరథ మహారథులను ఆహ్వానించవచ్చునని తెలుస్తోంది.

స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా:

స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా:

సంజనా గణేషన్‌ను జస్ప్రీత్ బుమ్రా పెళ్లాడబోతున్నాడని తెలిసి ఈమె గురించి సోషల్ మీడియాలో తెగ సర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్‌ 7తో కెరీర్‌ ఆరంభించారు. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన సంజన ఐపీఎల్‌ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే బుమ్రాతో ఏర్పడిన పరిచయం పరిణయానికి దారి తీసిందట. ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రస్తుతం ప్రజెంటర్‌గా వర్క్ చేస్తున్నారు.

 ఫెమీనా మిస్ ఇండియా పూణే:

ఫెమీనా మిస్ ఇండియా పూణే:

28 ఏళ్ల సంజనా గణేషన్‌కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. 2012లో ఫెమీనా స్టైలిష్ దివాలో ఫైనలిస్టుగా నిలిచారు. 2013లో ఫెమీనా గాడ్జియస్‌గా నిలిచారు. అలాగే 2013లో ఫెమీనా మిస్ ఇండియా పూణే కిరీటం సొంతం చేసుకున్నారు. 2014లో వచ్చిన ప్రముఖ డేటింగ్ రియాలిటీ షోలో కూడా సంజన పాల్గొన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో షో మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1.43 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పుడు బుమ్రాను పెళ్లి చేసుకుంటుందనే వార్తలతో సంజన మరింత ఫేమస్ అయ్యారు.

 పెళ్లికి ఇదే తగిన సమయం:

పెళ్లికి ఇదే తగిన సమయం:

ఇంగ్లండ్‌తో ఇంకా టీ20, వన్డే సిరీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఐపీఎల్ 2021 ఉంది. ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ జట్టుకు జస్ప్రీత్ బుమ్రా కీలక బౌలర్. ఆ వెంటనే జూన్‌లోనే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ జరగనుంది. ఇక అక్టోబరు-నవంబరులో టీ20 ప్రపంచకప్‌ ఉంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య ఖాళీ సమయమే లేదు. అందుకే పెళ్లికి ఇదే తగిన సమయం అని బుమ్రా భావించినట్లు సమాచారం.

India vs England: వాషింగ్టన్‌ సుందర్‌ గురించి.. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌తో మాట్లాడతా: రవిశాస్త్రి

Story first published: Monday, March 8, 2021, 19:00 [IST]
Other articles published on Mar 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+