For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sanjana Ganesan Hot Photos:బుమ్రా భార్య అందం చూస్తే మతిపోవాల్సిందే.!

 Jasprit Bumrah Wife Sanjana Ganesan Hot Photos Goes Viral On Internet
Photo Credit: twitter

హైదరాబాద్: టీమిండియా స్టార్ బౌలర్‌, ముంబై ఇండియన్స్ యార్కర్ల కింగ్ జస్​ప్రీత్​‌ బుమ్రా సతీమణి సంజనా గణేశన్ నేడు 31వ జన్మదినం జరుపుకుంటుంది. స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్ అయిన సంజనా ప్రస్తుతం లీవ్‌లో ఉంది. జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి ఐపీఎల్ 2022 సీజన్‌ను ఆస్వాదిస్తోంది. సతీమణి బర్త్ డే సందర్భంగా బుమ్రా సతీమణితో ఎక్కువ సమయాన్ని గడిపాడు. కెమెరామెన్‌గా అవతారమెత్తి భార్య అందాలను బంధించాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది. బాలీవుడ్ హీరోయిన్‌ను తలపించే సంజనా గణేశన్‌కు ఫ్యాన్స్ చాలానే ఉన్నారు.

 Jasprit Bumrah Wife Sanjana Ganesan Hot Photos Goes Viral On Internet

సంజనా గణేశన్‌కు అన్ని క్రీడల్లో మంచి పట్టుంది. మిస్‌ ఇండియా కావాలనేది ఆమె చిన్ననాటి కల. 2014లో బెంగళూరులో జరిగిన ఫెమీనా మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొంది. కొద్దిలో కిరీటం కోల్పోయింది. అందాల పోటీల్లో పాల్గొన్న తర్వాత ఎంటీవీ రియాలిటీ షో స్ప్లిట్స్‌విల్లా 7 సీజన్‌తో వెలుగులోకి వచ్చింది. గాయం కారణంగా ఈ షో నుంచి మధ్యలోనే తప్పుకుంది. అయితే ఈ షో సందర్భంగా సహచర కంటేస్టెంట్ అశ్విని కౌల్‌కు లిప్ లాక్ ఇచ్చింది. షో అనంతరం కూడా వీరి మధ్య ప్రేమాయణం నడిచింది. అయితే కొన్నాళ్లకు వీరి మధ్య వచ్చిన మనస్పర్థలతో విడిపోయారు. విడిపోయి మంచి స్నేహితులుగా ఉన్నారు.

 Jasprit Bumrah Wife Sanjana Ganesan Hot Photos Goes Viral On Internet

2019 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌తో సంజన స్టార్‌ ప్రెజెంటర్‌ అయింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత నిర్వహించే 'మ్యాచ్‌ పాయింట్‌', 'చీకీ సింగిల్స్‌' కార్యక్రమాల్లో తనదైన హోస్టింగ్‌తో అందర్ని ఆకట్టుకుంది. సంజనా బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌కు వీరాభిమాని అయిన సంజనా... ఖాన్‌ సహ యజమానిగా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున ఎక్స్‌క్లూజివ్‌ షోలు చేసింది. సంజన పుణె అమ్మాయి. అక్కడే పుట్టి పెరిగింది. మొదట్నుంచీ చదువుల్లో బాగా చురుకైన అమ్మాయి. సింబయోసిస్‌ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ అందుకుంది. ఐటీ, డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీలో కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేసింది.

 Jasprit Bumrah Wife Sanjana Ganesan Hot Photos Goes Viral On Internet

బుమ్రా, సంజనా ప్రేమకథ విషయానికొస్తే వీళ్ల రొమాన్స్‌ మొదట క్రికెట్‌ మైదానంలోనే మొదలైందంటారు. 2013, 2014 ఐపీఎల్‌ సీజన్‌లో మంచి ప్రదర్శన చేశాడు బుమ్రా. అతడిని సంజన ఇంటర్వ్యూ చేయడం వల్ల ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. కొన్నాళ్లకే మంచి స్నేహితులయ్యారు. కెరీర్‌, ఫేమ్‌తోపాటు ఇద్దరి మధ్య ప్రేమ వేగం అందుకుంది.

 Jasprit Bumrah Wife Sanjana Ganesan Hot Photos Goes Viral On Internet
Story first published: Friday, May 6, 2022, 20:17 [IST]
Other articles published on May 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+