హైదరాబాద్: టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీకి సిద్దమయ్యాడు. వెన్ను గాయంతో గతేడాదిగా జట్టుకు దూరమైన బుమ్రా.. శుక్రవారం నుంచి ఐర్లాండ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. ప్రధాన పేసర్‌గానే కాకుండా ఈ సిరీస్‌లో సారథిగా జట్టును నడిపించనున్నాడు.
ఆసియాకప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలకు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం బుమ్రాను ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. అప్పుడెప్పుడో 2019లో తొలిసారి వెన్నుగాయానికి గురైన బుమ్రా.. ఆ తర్వాత మూడేళ్లు వరుసగా ఆడాడు. బీసీసీఐ కూడా అతని వర్క్‌లోడ్‌మేనేజ్‌మెంట్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తూ.. తగిన విశ్రాంతినిచ్చింది.

పెళ్లి తర్వాతే వెన్ను గాయం..
2021 మార్చి 15న స్టార్ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేషన్‌ను బుమ్రా పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు సీక్రెట్‌గా లవ్ ఎఫైర్ నడిపిన ఈ ఇద్దరూ.. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం ఫామ్ కోల్పోయిన బుమ్రా అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చాడు. దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2021లోనూ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌లోనూ తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ 15 వికెట్లు మాత్రమే తీసాడు. అతని పేలవ ప్రదర్శన ముంబై ఇండియన్స్ ఘోర ఓటమికి కారణమైంది. 2022 జూలైలో ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. దాంతో అతను ఆ సిరీస్ మూడో వన్డే ఆడలేదు. వెన్ను గాయం తిరగబెట్టడంతో బుమ్రా దూరమయ్యాడని అప్పట్లో బీసీసీఐ వివరణ ఇచ్చింది.

ఆ వెంటనే వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌కు దూరమయ్యాడు. ఎన్‌సీఏలో వెన్ను గాయానికి చికిత్స తీసుకున్నాడు. పూర్తిగా కోలుకోకపోవడంతో ఆసియాకప్‌కు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2022 ముందు సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సిరీస్ తొలి రెండు టీ20ల్లో 6 ఓవర్లు మాత్రమే వేసిన అతను మళ్లీ వెన్ను గాయానికి గురయ్యాడు.

దాంతో ఆసీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2022తో పాటు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ పర్యటనకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‌తో పాటు ఇప్పటి వరకు జరిగిన ఒక్క సిరీస్ కూడా ఆడలేదు. వెన్ను గాయం మళ్లీ మళ్లీ తిరగబెట్టడంతో వైద్యుల సూచన మేరకు ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్ వేదికగా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
విలక్షణ శైలే కారణం..
తాజా ఐర్లాండ్ పర్యటన వరకు ఎన్‌సీఏలోనే రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. ఐర్లాండ్‌తో సిరీస్‌లోనైనా మునపటిలా రాణిస్తాడా? మళ్లీ వెన్ను గాయానికి గురవుతాడా? అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. బుమ్రా విలక్షణ బౌలింగ్ శైలే అతని వెన్ను గాయానికి కారణమని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటే మరికొందరు మాత్రం వింత వాదనను తెరపైకి తెచ్చారు.
అసహజ శృంగారం..?
ఆరంభంలో వెన్ను గాయం రికవరీలో భాగంగా ఇంటికే పరిమితమైన జస్‌ప్రీత్ బుమ్రా.. పూర్తిగా నయం కాకముందే సతీమణితో అసహజ శృంగారం చేయడం అతని గాయం తిరగబెట్టేలా చేసిందని కామెంట్ చేస్తున్నారు.

గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ ముందు జట్టుకు దూరమైన బుమ్రా.. కోలుకునే దశలో ఈ ఏడాది మార్చిలో మళ్లీ గాయపడటం చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని చెబుతున్నారు. ఈ మధ్యలో అతను ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదని, వెన్నుపై ఒత్తిడి పడేలా శృంగారం చేయడమే అతని గాయానికి కారణమని అభిప్రాయపడుతున్నారు.