మార్చి మధ్యలో జస్‌ప్రీత్ బుమ్రా పెళ్లి.. గోవాలో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్!

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ క్రమంలోనే అతను ఆట నుంచి విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో చివరి టెస్టు నుంచి తనకు విరామం కల్పించాలని బుమ్రా ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని కోరిన విషయం తెలిసిందే. బుమ్రా విజ్ఞప్తి మేరకు బీసీసీఐ అతడికి సెలవు మంజూరు చేసింది. వ్యక్తిగత కారణాలతో క్రికెట్ నుంచి బుమ్రా విరామం కోరాడని తెలియజేసింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు కూడా ఈ యార్కర్ల కింగ్‌ను ఎంపిక చేయలేదు. వన్డే సిరీస్‌కు కూడా అతను దూరమయ్యే అవకాశం ఉంది.

గోవాలో సన్నిహితుల మధ్య పెళ్లి
అయితే.. బుమ్రా అకస్మాత్తుగా లీవ్ పెట్టడంపై అభిమానుల్లో చర్చ మొదలైంది. దాంతో అతను పెళ్లి పీటలు ఎక్కనున్నాడనే ప్రచారం జోరు అందుకుంది. తాజాగా ఈ విషయాన్ని అతని దగ్గరి బంధువు ఒకరు ధ్రువీకరించారు. మార్చి మధ్యన బుమ్రా పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలిపారు. గోవాలో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో పెళ్లి జరగుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి బుమ్రా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలిపారు. పెళ్లి తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుక నిర్వహించే అవకాశం కూడా ఉందన్నాడు. దీనికి సహచర ఆటగాళ్లతో పాటు అతిరథ మహారథులను ఆహ్వానించవచ్చునని తెలుస్తోంది. అయితే.. బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయంపై వివరాలు తెలియాల్సి ఉంది.

అధికారి ప్రకటన రాలేదు..
తనదైన బౌలింగ్ శైలితో టీమిండియా ఫేస్ విభాగాన్ని బుమ్రా మరో ఎత్తుకు తీసుకెళ్లాడు. ఆసీస్ పర్యటనలో రాణించిన బుమ్రా.. గాయంతో ఆఖరి టెస్ట్‌కు దూరమయ్యాడు. మళ్లీ ఇంగ్లండ్‌పై తొలి టెస్టు బరిలోకి దిగాడు. అనంతరం రెండో టెస్టులో విరామం తీసుకొని తిరిగి మూడో టెస్టులో పాల్గొన్నాడు. మళ్లీ చివరిదైన నాలుగో టెస్టు నుంచి విరామం కోరాడు.
అయితే బుమ్రా పెళ్లి విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బుమ్రా చెబితే గాని అసలు విషయం వెలుగులోకి రాదు. 27 ఏళ్ల బుమ్రా భారత్ తరఫున 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. ఐపీఎల్ ద్వారా 2016లో భారత జట్టులోకి వచ్చిన బుమ్రా.. అనతికాలంలోనే స్టార్ పేసర్‌గా ఎదిగాడు.

ఇటీవల భారత్‌లో తొలి టెస్ట్..
2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో సుదీర్ఘ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన జస్ప్రీత్ బుమ్రా.. ఇటీవల భారత్‌లో తొలి టెస్ట్ మ్యాచ్ (చెన్నైలో జరిగిన తొలి టెస్టుతో) ఆడాడు. అప్పటివరకు బుమ్రా భారత్ తరపున 17 టెస్టులకు ప్రాతినిధ్యం వహించగా.. అవన్నీ విదేశాల్లోనే ఆడడం విశేషం. భారత్‌లో తొలి టెస్టు ఆడడానికి బుమ్రాకు మూడేళ్లు పట్టింది. సొంతగడ్డపై అరంగేట్రం చేసే ముందు విదేశాల్లో అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్‌గా బుమ్రా నిలిచాడు. బుమ్రా కంటే ముందు వెస్టిండీస్ ప్లేయర్ డారెన్ గంగా కూడా స్వదేశం బయట 17 టెస్టులు ఆడాడు.

అనుపమాతో ప్రేమాయణం..
దక్షిణాది సినీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌తో జస్‌ప్రీత్ బుమ్రా డేటింగ్ చేసినట్లు గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అనుపమా బర్త్‌డే సందర్భంగా బుమ్రా చేసిన ట్వీట్ అప్పట్లో హల్‌చల్ చేసింది. తొలుత తన బర్త్‌డే సందర్భంగా అనుపమ ట్విటర్ వేదికగా 'నాకు 24 ఏళ్ళు వచ్చేశాయి' అంటూ ఓ ఫొటోకు 24 అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. దానికి నెటిజన్లు కూడా ఈ కేరళ బ్యూటీకి విషెస్ తెలియజేశారు. కానీ బుమ్రా చేసిన ట్వీట్ అందరిని ఆకర్షించింది. ప్లే స్టేషన్‌లో గేమ్ ఆడుతున్న ఫొటోకు ''డోంట్ గ్రో అప్.. ఇట్స్ ఏ ట్రాప్'' అనే క్యాప్షన్ ఇచ్చాడు. దాంతో బుమ్రా-అనుపమా మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ ప్రచారం చేశారు. బుమ్రా ఉద్దేశం వేరే అయినా అభిమానులు మాత్రం అను పాప కోసమే చేశాడంటూ కామెంట్స్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications