ఆసియాకప్ 2025 టోర్నీకి ముందు టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఇంగ్లండ్ పర్యటనలో మూడు మ్యాచ్‌లే ఆడిన టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ఆసియా కప్ 2025 టోర్నీ ఆడనున్నాడు. పనిభారం కారణంగా ఈ టోర్నీకి బుమ్రా దూరంగా ఉంటాడని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఆసియాకప్ ఆడేందుకు బుమ్రా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. బుమ్రా.. ఆసియా కప్ ఆడితే వెస్టిండీస్‌తో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ నుంచి అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.
బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నుంచి భారత క్రికెటర్ల ఫిట్‌నెస్ రిపోర్ట్స్ అందిన తర్వాత అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ ఆగస్ట్ 19, 20వ తేదీల్లో సమావేశం కానుంది. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. హెర్నీయా సర్జరీ నుంచి కోలుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. ఇంగ్లండ్ పర్యటనలో దుమ్మురేపిన శుభ్‌మన్ గిల్ ఆసియా కప్‌తో టీ20 ఫార్మాట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన టీమిండియా ఆఖరి టీ20 సిరీస్‌కు గిల్ దూరంగా ఉన్నాడు. ఆ సిరీస్‌లో అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలతో కూడిన బ్యాటింగ్ లైనప్‌నే ఆసియాకప్‌లో కొనసాగించే అవకాశం ఉంది. కీపర్‌గా బ్యాటర్‌గా సంజూ శాంసన్ సత్తా చాటాడు. అతనికి బ్యాకప్‌గా జితేశ్ శర్మ లేదా ధ్రువ్ జురెల్‌కు అవకాశం లభించనుంది. ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉండటంతో జట్టు ఎంపిక సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది.
జస్‌ప్రీత్ బుమ్రా రాకతో సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వనున్నారు. రెండో పేసర్‌గా అర్ష్‌దీప్ సింగ్ ఆడనుండగా.. మూడో పేసర్‌గా ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణాల మధ్య పోటీ నెలకొంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో 25 వికెట్లు తీసిన ప్రసిధ్ కృష్ణవైపు సెలెక్టర్లు మొగ్గు చూపవచ్చు. స్పిన్ ఆల్‌రౌండర్ల కోటాలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆడనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్ ఆడనున్నారు. వన్డేల్లో కీపర్‌గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇవ్వడం కూడా కష్టమే.
జస్‌ప్రీత్ బుమ్రా రాకతో టీమిండియా బౌలింగ్ బలం పెరగనుంది. బుమ్రా వేసే నాలుగు ఓవర్లు జట్టుకు కీలకం కానున్నాయి. పొట్టి ఫార్మాట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా చివరిసారిగా టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా(2/18) తన ప్రదర్శనతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఐపీఎల్‌లోనూ బుమ్రా మెరుగైన ప్రదర్శనే చేశాడు.