అందులో కోహ్లీనే దాటేసిన బూమ్రా.. 3లో జడేజా, 4లో రోహిత్!!

హైదరాబాద్: భారత క్రికెటర్ల ఆర్జనలో ఎప్పుడూ కూడా బ్యాట్స్‌మన్ ముందుంటారు. అత్యధిక మ్యాచులు ఆడడం, ఏ-ప్లస్ లిస్ట్‌లో ఉండడమే ఇందుకు అసలు కారణం. అయితే ఈసారి ఆర్జనలో మాత్రం ఓ బౌలర్ ఉన్నాడు. అతడే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. 2020లో బూమ్రా ఏకంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీనే దాటేశాడు. 2020లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి అత్యధిక పారితోషికం తీసుకునే భారత క్రికెటర్‌గా 'బూమ్ బూమ్' బుమ్రా నిలిచాడు. కోహ్లీ కంటే రూ.9 కోట్ల మేర అధికంగా బూమ్రా సంపాదిస్తున్నాడు.

బుమ్రా@1
2020లో క్రికెటర్ల సంపాదనల వివరాలను బీసీసీఐ తాజాగా వెల్లడించింది. దీని ప్రకారం జస్ప్రీత్ బుమ్రా రూ 1.38 కోట్ల ఆదాయంతో టాప్‌లో నిలిచాడు. ఈ ఏడాది బుమ్రా మొత్తం 4 టెస్టు మ్యాచ్‌లు, 9 వన్డే మ్యాచ్‌లు, 8 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కీలక ఆటగాళ్లకు బీసీసీఐ ఒక్కో టెస్టుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6లక్షలు, టీ20కు రూ.3 లక్షలు జీతం ఇస్తుంది. 21 మ్యాచ్ ఫీజుల వచ్చే దానితో బుమ్రా 2020లో అత్యధిక పారితోషికం తీసుకునే భారత ఆటగాడిగా నిలిచాడు. బుమ్రా 2020ని శ్రీలంక పర్యటనతో ఆరంబించాడు. ఈ ఏడాది టీమిండియా ఆడిన అన్ని మ్యాచులలో బుమ్రా ఆడాడు.

కోహ్లీని దాటేసిన బూమ్రా
జస్ప్రీత్ బుమ్రా తర్వాత రూ. 1.29 కోట్లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ మూడు టెస్టులు, తొమ్మిది వన్డేలు మరియు 10 టీ20లు ఆడాడు. నిజానికి ఈ ఏడాది కూడా కోహ్లీనే ముందుండేవాడు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టుల్లో మొదటి టెస్టు తర్వాత ఇంటికి తిరిగి వచ్చేశాడు. దీంతో మిగతా మూడు టెస్టుల మ్యాచ్‌లకు అతడు దూరమయ్యడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజ్ లభించదు. దీంతో రెండో స్థానానికే పరిమితమయ్యాడు.

మూడో స్థానంలో జడేజా
విరాట్ కోహ్లీ తరువాత రూ.96 లక్షలతో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మూడో స్థానంలో ఉన్నాడు. జడేజా ఈ ఏడాది 2 టెస్ట్ ఆటలు, 9 వన్డేలు, 4 టీ20లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కంకషన్ కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు టీ20లు, మొదటి టెస్ట్‌లో పాల్గొనలేదు. లేదంటే అతడు ఒక కోటి మార్కును అందుకునేవాడు. రూ.30లక్షలతో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్ కేవలం 3 వన్డేలు, 4 టీ20 ఐలు మాత్రమే ఆడాడు. ఈ సంవత్సరం రోహిత్‌కు పలు గాయాలయ్యాయి. వీరంతా ప్రస్తుతం బీసీసీఐ ఏప్లస్ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్లే కావడం విశేషం. బుమ్రా, జడేజా ఇద్దరూ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్‌డే టెస్టులో ఆడుతున్నారు. రోహిత్ మూడో టెస్ట్ నుంచి ఆడనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ కోహ్లీ.. ధోనీకి 'స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్' అవార్డు!! టాప్ లేపిన పెర్రీ!