For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ద‌శాబ్ద‌పు అత్యుత్త‌మ క్రికెట‌ర్ కోహ్లీ.. ధోనీకి 'స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్' అవార్డు!! టాప్ లేపిన పెర్రీ!

ICC Awards 2020: MS Dhoni wins ICC Spirit of Cricket Award of the Decade, Virat Kohli Win Top Honour

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అవార్డుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ లేపాడు. ఈ ద‌శాబ్ద‌పు టెస్ట్ జట్టు‌కు కెప్టెన్‌గా ఎంపికైన కోహ్లీ.. సోమ‌వారం ప్ర‌క‌టించిన అవార్డుల్లో ద‌శాబ్ద‌పు అత్యుత్త‌మ క్రికెట‌ర్‌గా నిలిచి 'స‌ర్ గ్యారీఫీల్డ్ సోబ‌ర్స్' అవార్డ్ అందుకోనున్నాడు. ఇక ఐసీసీ వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు కూడా కోహ్లీకే దక్కింది. మూడు ఫార్మాట్లలోనూ భారత కెప్టెన్ ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్ అవార్డుకు ఎంపికయ్యాడు. కాని ఒకదాన్ని మాత్రమే గెలుచుకోగలిగాడు.

ధోనీకి అరుదైన గౌరవం

ధోనీకి అరుదైన గౌరవం

టెస్ట్ క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డును ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను వరించింది. టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్ అవార్డును ఆఫ్ఘ‌నిస్థాన్ ప్లేయ‌ర్ ర‌షీద్ ఖాన్ సొంతం చేసుకున్నాడు. ఇక ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ ఆఫ్ ద డెకేడ్ అవార్డును టీమిండియా మాజీ కెప్టెన్, మిస్ట‌ర్ కూల్ ఎంఎస్ ధోనీ గెలుచుకున్నాడు. అసాధారణ పరిస్థితులలో అంపైర్ ఔట్ ఇచ్చిన తరువాత ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌ ఇయాన్ బెల్‌ను క్రీజులో తిరిగి రావాలని చేసిన సంజ్ఞకు ధోనీకి ఈ అరుదైన గౌరవం దక్కింది. వెటోరి, జయవర్ధనే, బృంట్, మెక్కల్లమ్, మిస్బా, శృబిసోలే, విలియంసన్, కోహ్లీ ఈ అవార్డు కోసం పోటీపడ్డారు.

టాప్ లేపిన పెర్రీ

టాప్ లేపిన పెర్రీ

మహిళా క్రికెటర్ల కేటగిరీలోని అన్ని అవార్డులను ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిస్ పెర్రీ గెలుచుకున్నారు. ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ మరియు టీ20ఐ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ అవార్డును పెర్రీ తన ఖాతాలో వేసుకున్నారు. సోఫీ, డాటిన్, హీలీ, లాన్నింగ్, మిథాలీ, బేట్స్, గోస్వామి, టేలర్ లాంటి వారిని వెనక్కి నెట్టిన పెర్రీ అవార్డులను గెలుచుకున్నారు. మూడు అవార్డులు పెర్రీనే వరించడం ఇక్కడ విశేషం.

మొత్తం 20396 ప‌రుగులు

మొత్తం 20396 ప‌రుగులు

విరాట్ కోహ్లీ అవార్డు గెలిచిన‌ట్లు ప్ర‌క‌టిస్తూ.. ఈ ద‌శాబ్దంలో అత‌ను సాధించిన ప‌రుగులు, సెంచ‌రీలు, హాఫ్ సెంచ‌రీల‌ను ఐసీసీ తన ట్విట‌ర్‌లో షేర్ చేసింది. ఈ ద‌శాబ్దంలో కోహ్లీ మొత్తం 20396 ప‌రుగులు చేయ‌గా.. అందులో 66 సెంచ‌రీలు, 94 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 70కి పైగా ఇన్నింగ్స్ ఆడిన ప్లేయ‌ర్స్‌లో కోహ్లీదే (56.97) అత్యుత్తమ స‌గ‌టు కావ‌డం విశేషం. ఇక వ‌న్డేల విష‌యానికి వ‌స్తే ఐసీసీ అవార్డుల కాలంలో వ‌న్డేల్లో 10 వేల‌కుపైగా ప‌రుగులు చేసిన ఏకైక క్రికెట‌ర్ మనోడే. అందులో 39 సెంచ‌రీలు, 48 హాఫ్ సెంచ‌రీలు ఉండ‌గా.. స‌గ‌టు 61.83.

అవార్డ్స్ లిస్ట్

అవార్డ్స్ లిస్ట్

స‌ర్ గ్యారీఫీల్డ్ సోబ‌ర్స్-విరాట్ కోహ్లీ

వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్-విరాట్ కోహ్లీ

టెస్ట్ క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్-స్టీవ్ స్మిత్

టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ద డెకేడ్-ర‌షీద్ ఖాన్

స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ ఆఫ్ ద డెకేడ్- ఎంఎస్ ధోనీ

ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్-ఎల్లిస్ పెర్రీ

ఉమెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్-ఎల్లిస్ పెర్రీ

ఉమెన్స్ టీ20ఐ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్-ఎల్లిస్ పెర్రీ

Boxing Day Test: స్టార్క్ కవ్వింపులు.. అంతేధీటుగా బదులిచ్చిన జడేజా!!

Story first published: Monday, December 28, 2020, 16:35 [IST]
Other articles published on Dec 28, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+