Sydney Test: బుమ్రా చేసిన ఆ పనికి.. ఆశ్చర్యపోయిన అంపైర్!! ఏం చేయలేక రెండు చేతులు..! (వీడియో)

సిడ్నీ: టీమిండియా స్టార్ పేసర్, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మైదానంలో ఎప్పుడూ సరదాగా నవ్వుతూ కనిపిస్తుంటాడు. బౌలింగ్ చేసేటప్పుడు బ్యాట్స్‌మన్ బౌండరీలు బాదినా అతడు అసహనానికి గురవ్వడం చాలా చాలా అరుదు. అయితే ఎన్నడూ లేనివిధంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పలుమార్లు తన అసహనాన్ని ప్రదర్శించాడు. బౌలింగ్ ఎండ్‌లో వికెట్లపై ఉండే బెయిల్స్‌ను పడగొడుతూ కనిపించాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ నాలుగో రోజు ఆటలో కూడా మరోసారి అలానే చేశాడు. అది చూసిన అంపైర్ పాల్ రీఫిల్ ఏం చేయలేకపోయాడు.
చిర్రెత్తికొచ్చిందేమో:
నాలుగో రోజు ఆటలో ఒకానొక దశలో ఆస్ట్రేలియా 259 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (51) పరుగులు, కామెరాన్ గ్రీన్ (10) పరుగులతో ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన స్మిత్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుని ధాటిగా ఆడుతున్నాడు. ఇక టీమిండియా రవీంద్ర జడేజా గైర్హాజరీలో నలుగురు బౌలర్లతోనే బౌలింగ్ చేస్తూ వచ్చింది. దీన్తనో కీలక బౌలర్‌గా వికెట్ తీయాల్సిన ఒత్తిడి బుమ్రాపై మరింత ఎక్కువైంది. మరో సీనియర్ ఆర్ అశ్విన్ ఒకవైపు బౌలింగ్ చేస్తున్నా వికెట్లు మాత్రం పడడం లేదు. దీంతో బుమ్రాకు చిర్రెత్తికొచ్చిందేమో తనలో ఎప్పుడు చూడని ఒక కోణాన్ని చూపించాడు.

బెయిల్స్‌ను పడగొడుతూ:
బంతి వేయడానికి బౌలింగ్ ఎండ్‌వైపు వెళుతున్న జస్ప్రీత్ బుమ్రా నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్‌ను చూస్తూ.. ఎడమ చేతితో బెయిల్స్‌ను పడగొడుతూ అలా వెళ్లిపోయాడు. 'స్మిత్ ఇంక ఎంతసేపు ఆడుతావు.. ఇక ఔట్ అవ్వవా' అన్నట్లుగా బుమ్రా సంకేతం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. ఈ ఘటనతో ఫీల్డ్ అంపైర్ పాల్ రిఫీల్ షాక్ తిన్నాడు. ఏం చేయలేక రెండు చేతులు నడుముపై పెట్టుకుని.. ఒక నిమిషం పాటు బుమ్రాను అలాగే చూస్తూ నిలుచుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో వైరల్‌గా మారింది. అభిమానులు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

స్మిత్ సూపర్ బ్యాటింగ్:
ఆస్ట్రేలియా ఆదివారం 312/6 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 94ని కలుపుకొని భారత్‌కు మొత్తం 407 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మార్కస్ లబుషేన్ (73: 118 బంతుల్లో 9x4), స్టీవ్ స్మిత్ (81; 167 బంతుల్లో 8x4, 1x6) అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీలు బాదారు. కామెరాన్ గ్రీన్ (84; 132 బంతుల్లో 8x4, 4x6), టిమ్ పైన్ (39; 52 బంతుల్లో 6x4) ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.

గిల్, రోహిత్ ఔట్:
నాలుగో రోజు అట ముగిసేసమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. భారీ ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ (52; 98 బంతుల్లో 5x4, 1x6), శుభ్‌మన్ గిల్ (31; 64 బంతుల్లో 4x4) మంచి శుభారంభం ఇచ్చి ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో చేటేశ్వర్ పుజారా (9), అజింక్య రహానే (4)లు ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 309 రన్స్ అవసరం. మరోవైపు ఆసీస్ విజయానికి ఎనిమిది వికెట్ల దూరంలో ఉంది.
Sydney Test: అసలుసిసలైన రౌడీల్లా ప్రవర్తించారు.. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి: కోహ్లీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications