టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్స్ సొంతం చేసుకున్న తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డ్‌ను అధిగమించాడు. 2016లో అశ్విన్ అత్యుత్తమంగా 904 రేటింగ్ పాయింట్స్ సాధించగా.. జస్‌ప్రీత్ బుమ్రా 907 రేటింగ్ పాయింట్స్‌తో అతని రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. ప్రస్తుతం టెస్ట్ బౌలింగ్ ర్యాకింగ్స్‌లో బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 4 టెస్ట్‌ల్లో 30 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతోనే అత్యధిక రేటింగ్ పాయింట్స్ సొంతం చేసుకున్నాడు. బుమ్రా తర్వాత ఆస్ట్రేలియా పేసర్లు జోష్ హజెల్ వుడ్(843), ప్యాట్ కమిన్స్(837)తో పాటు సౌతాఫ్రికా బౌలర్లు కగిసో రబడా(832), మార్కో జాన్సెన్(803) టాప్-5లో కొనసాగుతున్నారు.

టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో యశస్వి జైస్వాల్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని నాలుగో స్థానంలో నిలిచాడు. మెల్ బోర్న్ టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే. దాంతో అతని ర్యాంక్ మెరుగైంది. ఈ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి 20 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం అతను 53వ స్థానంలో నిలిచాడు. జోరూట్(895 పాయింట్స్), హ్యారీ బ్రూక్(876), కేన్ విలియమ్సన్(867)టాప్-3లో కొనసాగుతున్నారు.
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్ట్ శుక్రవారం నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది.