
నో రెస్ట్.. జడేజా ఆడుతాడు..
మీడియా సమావేశంలో వైస్ కెప్టెన్ బుమ్రా ముందు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. అవన్నీ గాలి వార్తలేనంటూ కొట్టిపారేసాడు. అంత మంచి ప్రదర్శన కనబర్చిన తర్వాత ఏ ఆటగాడైనా బెంచ్‌పైనే కూర్చోవాలని అనుకుంటాడా? అని బుమ్రా ప్రశ్నించాడు. అతను కూడా విశ్రాంతి కోరకడనుకుంటున్నానని, ఫస్ట్ టెస్ట్ పెర్ఫామెన్స్‌నే రిపీట్ చేసేందుకు ప్రయత్నిస్తాడని తెలిపాడు. ఇక అక్షర్ పటేల్ జట్టుతో చేరడంతో టీమ్ బలం మరింత రెట్టింపు అయ్యిందని చెప్పాడు. అంతేకాకుండా కుల్దీప్ యాదవ్‌ను టీమ్‌మేనేజ్‌మెంట్ పంపించలేదని, అతనే బయో బబుల్‌లో ఉండటం ఇష్టంలేక వెళ్లిపోయాడని చెప్పాడు. బబుల్‌లో ఉండటం అంత సులువైన పని కాదని, మానసికంగా తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పుకొచ్చాడు.

మానసికంగా రెడీ అవ్వాలి..
ఇక డై/నైట్ టెస్ట్ కోసం మానసికంగా సన్నదం కావాల్సి ఉంటుందని, ఫ్లడ్ లైట్ల వెలుతురులో పింక్ బాల్‌తో ఫీల్డింగ్, బౌలింగ్ చేయడం కాస్త సవాల్‌తో కూడుకున్న పనని బుమ్రా అభిప్రాయపడ్డాడు. ‘డే/ నైట్ టెస్టు ఆడుతున్నామంటే దానికి మానసికంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఫ్లడ్‌లైట్ల వెళుతురులో ఫీల్డింగ్, బౌలింగ్ చేయడం కాస్త సవాల్‌తో కూడుకున్నది. వన్డే, టీ20 అయితే ఒక్క రోజులో ముగుస్తుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించదు. కానీ పింక్‌బాల్ టెస్టు అంటే ఐదురోజులు ఫ్లడ్‌లైట్స్ వెళుతురులో ఆడాల్సి ఉంటుంది. అందుకే వీటన్నింటిన మైండ్‌లో పెట్టుకొని మా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నాం.

టీమ్ కాంబినేషన్ డిసైడ్ అవ్వలేదు..
మేము పెద్దగా డే/ నైట్ మ్యాచ్‌లు ఆడలేదు కాబట్టి.. ప్రతీ పింక్‌బాల్ టెస్టులో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక మ్యాచ్‌లో ముగ్గురు పేస్ బౌలర్లా? లేక ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలా? అనేది ఆలోచిస్తున్నాం. ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగితే జట్టుకు ప్రయోజనం చేకూరుతుందనే విషయంపై సమాలోచనలు చేస్తున్నాం. డే/ నైట్ టెస్టు అంటే పింక్‌బాల్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. రాత్రిళ్లు పిచ్ సీమర్లకు అనుకూలిస్తుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకుంటే సిరాజ్‌కు చోటు ఉండొచ్చు.. లేదంటే అక్షర్ తుది జట్టులోకి రావొచ్చు. దీనికి సంబంధించిన పారామీటర్స్‌ను ఇంకా సిద్ధం చేసుకోలేదు.'అని బుమ్రా తెలిపాడు.

టీమిండియా 2-1
ఇక బుమ్రా టీమిండియా తరపున 28 టెస్టుల్లో 115 వికెట్లు తీశాడు. తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్టులోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో రోహిత్ సేన ఉంది. ఇక ఇప్పటివరకు టీమిండియా మూడు పింక్‌బాల్ టెస్టులు ఆడగా.. రెండింటిలో గెలిచి ఒకదాంట్లో ఓడింది. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లతో ఆడిన మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరిగిన పింక్‌బాల్ టెస్టులో మాత్రం ఓటమి చవిచూసింది. అటు లంక కూడా మూడు పింక్‌బాల్ టెస్టులు ఆడగా.. రెండింటిలో గెలిచి.. ఒకదాంట్లో ఓటమి చూసింది.


Click it and Unblock the Notifications
