Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓడినా.. ఆసీస్‌ను వణింకించాం: జస్‌ప్రీత్ బుమ్రా

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయినా.. గట్టి పోటీనిచ్చామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా అన్నాడు. గాయంతో బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై బౌలింగ్‌ చేయకపోవడం అసహనానికి గురిచేసిందన్నాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్ 3-1తో గెలుచుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

162 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 27 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఉస్మాన్ ఖవాజా(45 బంతుల్లో 4 ఫోర్లతో 41)రాణించగా.. ట్రావిస్ హెడ్(38 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్), బ్యూ వెబ్‌స్టర్(34 బంతుల్లో 6 ఫోర్లతో 39) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(3/65) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/69) ఒక్క వికెట్ పడగొట్టాడు. వెన్ను గాయం తిరగబెట్టడంతో రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేయలేదు. ఇది ఆసీస్‌కు కలిసొచ్చింది.

Jasprit Bumrah says The whole series was well fought After Australia Win Boarder Gavaskar Trophy

ఈ సిరీస్‌లో 32 వికెట్లు తీసిన బుమ్రా.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన బుమ్రా.. ఈ సిరీస్‌లో ఓడినా గట్టి పోటీనిచ్చామని తెలిపాడు. 'గాయంతో బౌలింగ్ చేయకపోవడం అసహనానికి గురి చేసింది. కానీ కొన్నిసార్లు మన శరీరాన్ని మనం గౌరవించాలి. మన శరీరంతో మనం పోరాడలేం. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులను అంగీకరించాల్సిందే. ఈ సిరీస్‌లోనే బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్‌పై బౌలింగ్ చేయలేకపోవడం బాధగా ఉంది.

తొలి ఇన్నింగ్స్ తర్వాతే వెన్ను నొప్పితో కాస్త అసౌకర్యానికి గురయ్యాను. ఈ ఉదయం మా ఆటగాళ్లతో నమ్మకం గురించి మాట్లాడాను. తొలి ఇన్నింగ్స్‌ మధ్యలో నేను దూరమైన మిగతా బౌలర్లు బాధ్యత తీసుకొని అద్భుతంగా రాణించారు. అదే ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపే ప్రయత్నం చేశాను. మా వ్యూహాలను అమలు చేయాలనుకున్నాం. కానీ కుదురలేదు.

ఈ సిరీస్ మొత్తం మేం అద్భుతంగా పోరాడం. ఈ రోజు కూడా ఆసీస్‌ను ఇబ్బంది పెట్టాం. ఇదో అద్భుతమైన సిరీస్. ఈ సిరీస్‌తో జట్టుగా చాలా విషయాలు నేర్చుకున్నాం. ముఖ్యంగా చాలా అనుభవాన్ని పొందాం. చాలా మంది కుర్రాళ్లు ఈ సిరీస్‌తో అనుభవంతో పాటు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. అవి భవిష్యత్తులో వారికి ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో అనే విషయాన్ని నేర్చుకున్నారు. ఈ సిరీస్ గెలిచిన ఆసీస్‌కు అభినందనలు. మేం మా తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకు సాగుతాం.'అని జస్‌ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, January 5, 2025, 9:57 [IST]
Other articles published on Jan 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+