
టెక్నిక్‌లో మార్పు లేదు..
'నిజాయితీగా చెప్పాలంటే నా బౌలింగ్‌లో నేను ఎలాంటి మార్పులు చేసుకోలేదు. కేవలం నా ఆలోచన దృక్పథాన్ని సరిచేసుకున్నా. ఫలితంపై ఆలోచించడం మానేసా. నా నైపుణ్యాలకు కట్టుబడి ప్రరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేస్తున్నా.కొత్త మెలకువలను నేర్చుకుంటూ నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నా.
ఆటను ఆస్వాదిస్తున్నా.'అని తెలిపాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు బుమ్రా ఈ సందర్భంగా అభినందనలు తెలిపాడు. అతని విజయంతో యావత్ భారతవానికి సంతోషాన్నిచ్చిందన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో జస్‌ప్రీత్ బుమ్రా 36.4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి కేవలం ఒకే ఒక్క వికెట్ తీసాడు. అతని వైఫల్యం భారత ఫలితంపై ప్రభావం చూపింది. చరిత్రకు అడుగు దూరంలో కోహ్లీసేన నిలిచిపోయింది.

సెషన్ బై సెషన్ ఆడితే..
ఇక మ్యాచ్ ఫలితంపై స్పందిస్తూ.. 'క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడే మనపై మనకు నమ్మకం పెంచుకోవాలి. నీతో పాటు జట్టు విజయం కోసం పరితపించాలి. ఈ మ్యాచ్ ఫలితంపై మేం ఎక్కువగా ఆలోచించడం లేదు. మాకు మంచి ఆరంభం లభించింది. దాన్ని సెషన్, సెషన్‌కు కొనసాగించాలి. సానుకూల ధృక్పథంతో బ్యాటింగ్ చేయాలి'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.
తొలి టెస్టులో ఆఖరి రోజు భారత్ ఒక సెషన్ కుదురుగా ఆడితేచాలు ఇంగ్లండ్ పర్యటనలో శుభారంభం చేయొచ్చు. 209 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్ ఆట నిలిచే సమయానికి పావువంతు స్కోరు చేసేసింది. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ధాటిగా ఆడిన రాహుల్ (38 బంతుల్లో 26; 6 ఫోర్లు) నిష్క్రమించగా... రోహిత్ (12 బ్యాటింగ్), పుజారా (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆదివారం ఇంకా 157 పరుగులు చేస్తే భారత్ జయభేరి మోగిస్తుంది.

జోరూట్ సెంచరీ..
అంతకుముందు 25/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (172 బంతుల్లో 109; 14 ఫోర్లు) సెంచరీ సాధించాడు. ఇతన్ని శతక్కొట్టిన తర్వాత ఔట్ చేసిన బుమ్రా (5/64) మిగతా టాపార్డర్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చాడు.
ఓపెనర్ సిబ్లీ (28; 2 ఫోర్లు), వన్‌డౌన్‌లో క్రాలీ (6) సహా లోయర్ ఆర్డర్‌లో స్యామ్ కరన్ (45 బంతుల్లో 32; 4 ఫోర్లు), బ్రాడ్ (0)లను బుమ్రా ఔట్ చేశాడు. మరోవైపు శార్దుల్... లారెన్స్ (25), బట్లర్ (17) వికెట్లను పడేశాడు. దీంతో ఇంగ్లండ్ వరుస విరామాల్లో క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి.

దడ పుట్టిస్తోన్న చేజింగ్ రికార్డ్..
ఇంగ్లండ్ గడ్డ మీద భారత క్రికెట్ జట్టు చేజింగ్ రికార్డు అభిమానులను కలవరపెడుతోంది. భారత్ సెకెండ్ ఇన్నింగ్ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పటిదాకా టీమిండియా.. ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేదించింది మూడుసార్లు మాత్రమే. లక్ష్య ఛేదనలో అందుకున్న అత్యధిక స్కోరు 173 పరుగులు. 1971లో ఓవల్‌లో భారత్ 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. విజయాన్ని అందుకుంది. ఆ తరువాత 1986లో క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో సెకెండ్ ఇన్నింగ్ ఆడుతూ 134 పరుగుల టార్గెను అందుకుంది.
ఆ తరువాత- 2007లో మాత్రమే మరోసారి టార్గెట్‌ను ఛేదించింది టీమిండియా. ఇదే ట్రెంట్‌బ్రిడ్జ్ స్టేడియంలో ప్రత్యర్థి నిర్దేశించిన అతి తక్కువ స్కోరు 73 పరుగులను అందుకుంది. ఈ మూడు సందర్భాల్లో మాత్రమే టీమిండియా రెండోసారి బ్యాటింగ్ చేసి.. గెలిచింది. తాజా 209 పరుగుల లక్ష్యాన్ని చేధిస్తే మాత్రం భారత్‌కు ఘనమైన రికార్డు దక్కుతుంది.


Click it and Unblock the Notifications












