బుమ్రాకు బ్యాటింగ్ నేర్పించింది నేనే: సంజనా గణేశన్

న్యూఢిల్లీ: టీమిండియా తాత్కలిక కెప్టెన్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా తన దగ్గరే బ్యాటింగ్ మెళుకవలు నేర్చుకున్నాడని అతని సతీమణి సంజనా గణేశన్ తెలిపింది. ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్‌లో బుమ్రా(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) బ్యాటింగ్‌లో దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు బౌలింగ్‌లో సత్తా చాటిన బుమ్రా.. కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత బ్యాటింగ్‌లోనూ మెరిసాడు. ప్రొఫెషనల్ బ్యాటర్‌ను తలపిస్తూ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా దిగ్గజ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఒకే ఓవర్‌లో 35 పరుగులు పిండుకొని వరల్డ్ రికార్డు నమోదు చేశాడు.
చెలరేగిన బుమ్రా..
భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఇన్నింగ్స్ 84వ ఓవర్‌లో బుమ్రా ధాటిగా ఆడటంతో 4, 5(వైడ్), 7(నోబాల్), 4, 4, 4, 6, 1తో 35 పరుగులు వచ్చాయి. ఇందులో బుమ్రా బ్యాట్ నుంచి 29 రన్స్ రాగా.. మిగతావి ఎక్స్‌ట్రాల రూపంలో లభించాయి. ఇక పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ప్రొఫెషనల్ బ్యాటర్‌గా చెలరేగిన బుమ్రాను చూసి అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజనా గణేశన్ ముందు బుమ్రా బ్యాటింగ్ గురించి ప్రస్తావించగా.. ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బ్యాటింగ్ నేర్పింది నేనే..
తానే బుమ్రాకు బ్యాటింగ్ నేర్పానని సరదాగా చెప్పుకొచ్చింది. బౌలింగ్ విషయాన్ని ప్రస్తావించగా.. దాని గురించి తనకు తెలియదని, కేవలం తాను బ్యాటింగ్ నేర్పించడంపైనే ఫోకస్ పెట్టానని పేర్కొంది. 'నేను బుమ్రా బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టా. అందులో నేను సక్సెస్ సాధించా. బుమ్రా కొట్టిన పరుగులన్నీ కూడా నావే'అంటూ సంజన మురిసిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయర్దనే సైతం ఈ ఇంటరాక్షన్‌లో పాల్గొన్నాడు.
వరల్డ్ రికార్డు..
టెస్ట్‌ల్లో ఒకే ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్‌గా బ్రాడ్ చెత్త రికార్డు ఖాతాలో వేసుకోగా.. టెస్ట్‌ల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసి బ్యాటర్‌గా బుమ్రా చరిత్రకెక్కాడు. 2003లో జొహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ ఆర్.పీటర్సన్ బౌలింగ్‌లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా 28 పరుగులు రాబట్టాడు. ఇప్పుడు వరకు అదే ప్రపంచ రికార్డు కాగా.. ఇప్పుడు బుమ్రా 29 పరుగులు సాధించి లారా రికార్డును బద్దలు కొట్టాడు.
భారత్‌కు భారీ ఆధిక్యం
ఇక 84/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు కుప్పకూలింది. జానీ బెయిర్ స్టో(140 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106) సెంచరీతో ఆదుకున్నాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్(25) కలిసి ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించిన బెయిర్ స్టో.. సామ్ బిల్లింగ్స్(36)తో కలిసి ఏడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం అందించాడు. దాంతో ఇంగ్లండ్ ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకుంది. ఇక భారత బౌలర్లలో సిరాజ్‌కు తోడుగా బుమ్రా మూడు వికెట్లు తీయగా.. షమీ రెండు, శార్దూల్ ఓ వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications