ఈ పెద్దోళ్ల మాటలు అస్సలు పట్టించుకోను.. అదే నా సక్సెస్ సీక్రెట్: జస్‌ప్రీత్ బుమ్రా

లండన్: క్రికెట్ విశ్లేషకుల ప్రశంసలకు పొంగిపోవడం.. విమర్శలకు కృంగిపోవడం వంటివి తాను చేయనని టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అన్నాడు. అదే తన కెరీర్ సక్సెస్ సీక్రేటని ఈ యార్కర్ల కింగ్ చెప్పుకొచ్చాడు. మంగళవారం ఇంగ్లండ్‌తో ఏకపక్షంగా సాగిన వన్డే మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బుమ్రా (6/19) తన బౌలింగ్‌తో నిప్పులు చెరిగాడు. అసాధారణమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఈ విజయానంతరం తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసిన బుమ్రా.. చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఇంత ఫోకస్‌గా ఉండటానికి గల కారణాన్ని వెల్లడించాడు.

ప్రజెంట్ కాలంలో ఉండటం ముఖ్యం..
'వర్తమాన కాలంలో ఉండటానికే నేను ఇష్టపడతాను. ఈ రోజుల్లో ఓ ఆటగాడి చుట్టూ ప్రతికూల పరిస్థితులున్నాయి. విమర్శలు, ప్రశంసలతో సదరు ఆటగాడు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. నేను మాత్రం నా ఆట, సన్నాహకాలపైనే ఫోకస్ పెడుతాను. ఫలితం ఎలా ఉన్నా నేను నా విధానాన్నే నమ్ముకుంటా. ఈ ఒక్క ఫార్మాట్‌లోనే రాణిస్తా.. ఇంకో ఫార్మాట్ నాకు కలిసి రాదు అనే ఆలోచనలో నేను ఉండను. నాకు అన్ని ఫార్మాట్లు ఒక్కటే. ప్రతీ ఫార్మాట్ ఆస్వాదిస్తాను.

బ్యూటీ ఆఫ్ క్రికెట్ ఏంటంటే..?
ఈ క్రికెట్ పెద్దల అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. కానీ సీరియస్‌గా తీసుకోను. అవి ప్రశంసలైనా.. విమర్శలైనా పట్టించుకోను. నాపై ప్రశంసల జల్లు కురిసినా నేను స్టేబుల్‌గా ఉంటాను. బ్యూటీ ఆఫ్ క్రికెట్ ఏంటంటే.. ఒక రోజు నీకు అన్ని అనుకూలంగా జరిగితో మరో రోజు ప్రతీకూలంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ స్టేబుల్‌గా ఉండటం చాలా ముఖ్యం. ప్రతీ రోజు కొత్త దినమే. కొన్నిసార్లు తొలి బంతికే ఎడ్జ్ తాకి వికెట్ రావచ్చు. మరో రోజు మాత్రం డే అంతా బౌలింగ్ చేసినా వికెట్ దొరకకపోవచ్చు'అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

చెలరేగిన రోహిత్..
తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ మూడు వన్డేల సిరీస్‌లో 10తో ఆధిక్యంలో నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జస్‌ప్రీత్ బుమ్రా (6/19) సంచలన బౌలింగ్‌కు, మహ్మద్ షమీ (3/31) మెరుపులు కూడా తోడవడంతో మొదట ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జోస్ బట్లర్ (30; 32 బంతుల్లో 6×4) టాప్‌స్కోరర్.
అనంతరం కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (76 నాటౌట్; 58 బంతుల్లో 7×4, 5×6) చెలరేగడం.. మరో ఓపెనర్ ధావన్ (31 నాటౌట్; 54 బంతుల్లో 4×4) కూడా నిలకడగా ఆడడంతో భారత్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్టూ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. భారత పేసర్లు విజృంభించిన పిచ్ మీద ఇంగ్లిష్ బౌలర్లను అసలేమాత్రం లెక్క చేయలేదు రోహిత్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications