IND vs SL: బుమ్రా రీఎంట్రీ.. SRH ఆటగాడిపై వేటు! భారత టెస్ట్ టీమ్ మార్పులివే!
రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత టెస్ట్ టీమ్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బీసీసీఐ మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనలో వెల్లడించింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2027లో భాగంగా ఆగస్ట్ 15న ప్రారంభమయ్యే ఈ రెండు టెస్ట్‌ల సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ టీమిండియాను నడిపించనుండగా.. కేఎల్ రాహుల్ అతనికి డిప్యూటిగా వ్యవహరించనున్నాడు. ఆగస్ట్ 15-19 మధ్య గాలే వేదికగా తొలి టెస్ట్ జరగనుండగా.. ఆగస్ట్ 23-27 మధ్య కొలంబో వేదికగా రెండో టెస్ట్ జరగనుంది.
బుమ్రా, జడేజా రీఎంట్రీ..
ఐపీఎల్ తర్వాత అఫ్గాన్‌తో టీమిండియా ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడగా..ఇది డబ్ల్యూటీసీలో భాగంగా లేదు. అయితే శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన భారత టెస్ట్ జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌కు దూరంగా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే అతను ఫిట్‌నెస్ టెస్ట్‌ను క్లియర్ చేయాల్సి ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో బుమ్రా గాయపడిన సంగతి తెలిసిందే.

అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌తో పాటు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇవ్వగా.. 33 ఏళ్ల దేశవాళీ స్పిన్ ఆల్‌రౌండర్ సరాన్ష్ జైన్‌కు తొలిసారి టీమిండియా పిలుపు దక్కింది. భారత్-ఏ తరఫున శ్రీలంక-ఏ జరిగిన అనధికారిక టెస్ట్ సిరీస్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో అతనికి టీమిండియా పిలుపు వరించింది.
హర్ష్‌దూబే, నితీష్ రెడ్డి ఔట్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ హర్ష్‌దూబేకు అవకాశం ఇవ్వకుండా సెలెక్టర్లు పక్కనపెట్టారు. అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌కు హర్ష్ దూబే ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కలేదు. అతనికి బదులుగా అఫ్గాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడిన మానవ్ సుతార్‌ను శ్రీలంక పర్యటనకు ఎంపిక చేశాడు. అఫ్గాన్‌తో అరంగేట్రంలోనే మానవ్ సుతార్ 7 వికెట్లతో సత్తా చాటాడు. దాంతోనే హర్ష్ దూబేను పక్కనపెట్టి మరి మానవ్ సుతార్‌కు అవకాశం ఇచ్చారు.
తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ పర్యటనకు ఎంపికవ్వలేదు. ఇంగ్లండ్ పర్యటనకు ముందే అతను తొంటి గాయంతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అతని ఫిట్‌నెస్ అప్‌డేట్‌ను కూడా బీసీసీఐ ప్రస్తావించలేదు.
శ్రీలంక పర్యటనకు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్(కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరాన్ష్ జైన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

