జస్‌ప్రీత్ బుమ్రా స్టన్నింగ్ ఇన్ స్వింగర్.. బిత్తరపోయిన ట్రావిస్ హెడ్!(వీడియో)
టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి అసాధారణ బౌలింగ్‌తో చెలరేగాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌లో బుమ్రా మూడు వికెట్లతో రాణించాడు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్(0)ను బుమ్రా డకౌట్ చేసిన విధానం ఈ సిరీస్‌కే హైలైట్‌గా నిలిచింది.
గత మూడు మ్యాచ్‌ల్లో రెండు భారీ శతకాలతో పాటు ఓ హాఫ్ సెంచరీతో సత్తా చాటిన ట్రావిస్ హెడ్ తాజా మ్యాచ్‌లో బుమ్రా ధాటికి ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. బుమ్రా ఇన్‌స్వింగర్‌ను పసిగట్టలేకపోయిన ట్రావిస్ హెడ్ ఆ బంతిని వదిలేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ స్టన్నింగ్ డెలివరీకి ట్రావిస్ హెడ్ బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 67వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని బుమ్రా లేట్ ఇన్‌స్వింగర్ వేయగా.. ట్రావిస్ హెడ్ ఆడకుండా వదిలేసాడు. బంతి ఆఫ్ సైడ్ వెళ్తుందని భావించాడు. కానీ లోపలికి స్వింగ్ అయిన బంతి ఆఫ్ స్టంప్ బెయిల్స్‌ను కిందపడేసింది. దాంతో ట్రావిస్ హెడ్ డకౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. బంతి స్వింగ్ అవుతుందని ఏమాత్రం ఊహించని ట్రావిస్ హెడ్.. కాసేపు బిత్తరపోయాడు. అలా ఎలా ఔటయ్యాననే ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.
అరంగేట్ర ప్లేయర్ సామ్ కోన్‌స్టాస్ ధాటికి ఆరంభంలో బుమ్రా తడబడ్డాడు. అతని ధాటికి మూడేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో సిక్సర్ సమర్పించుకున్నాడు. దాదాపు 4,483 బంతుల తర్వాత బుమ్రా బౌలింగ్‌లో సిక్స్ నమోదైంది. చివరిసారిగా 2021లో బుమ్రా సిక్సర్ ఇచ్చాడు. సామ్ కోన్‌స్టాస్ విధ్వంసకర బ్యాటింగ్‌తో తొలి 6 ఓవర్లలోనే బుమ్రా 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత పుంజుకున్న బుమ్రా.. కీలక భాగస్వామ్యాలను విడదీసాడు.
ఉస్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), ట్రావిస్ హెడ్(0), మిచెల్ మార్ష్(4)లను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అరంగేట్ర ప్లేయర్ సామ్ కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), ఉష్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), మార్నస్ లబుషేన్(145 బంతుల్లో 7 ఫోర్లతో 72), స్టీవ్ స్మిత్(111 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 68 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు.. ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.
“Game-changer player is only one guy JASPRIT BUMRAH!" 💪😎#TravisHead "leaves" without troubling the scorers! 🫢#AUSvINDOnStar 👉 4th Test, Day 1 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/p6a0gzc3BB
— Star Sports (@StarSportsIndia) December 26, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications