For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అయ్యో మయాంక్ అగర్వాల్‌‌.. జస్ప్రీత్ బుమ్రా భార్య సంజయ్‌ బంగర్‌ కాదు!!

Jasprit Bumrah Marriage: Mayank Agarwal tags Sanjay Bangar instead of Sanjana Ganesan

హైదరాబాద్: టీమిండియా స్టార్ పేసర్‌, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, మాజీ మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ సంజనా గణేశన్‌ను గోవాలో సన్నిహితుల సమక్షంలో సోమవారం వివాహమాడాడు. ట్విట్టర్ వేదికగా బుమ్రా తన పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. దీంతో బీసీసీఐ, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సహచర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు. అయితే టీమిండియా టెస్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్..‌ బుమ్రాకు కంగ్రాట్స్‌ చెబుతూ షేర్‌ చేసిన కామెంట్‌ అందరిలో నవ్వులు పూయించింది.

కంగ్రాట్స్‌ బుమ్రా.. సంజయ్

జస్ప్రీత్ బుమ్రాకు శుభాకాంక్షలు తెలిపిన మయాంక్ అగర్వాల్‌ పొరపాటున అతని భార్య సంజనా గణేశన్‌కు బదులుగా.. టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్‌ బంగర్‌ పేరును ట్యాగ్‌ చేశాడు. 'కంగ్రాట్స్‌ జస్ప్రీత్ బుమ్రా.. సంజయ్‌ బంగర్‌! మీ వైవాహిక జీవితం బాగుండాలని, నిత్యం సంతోషంతో ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశాడు. మయాంక్‌ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. 'అయ్యో మయాంక్.. బుమ్రా భార్య సంజయ్‌ బంగర్‌ కాదు' అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే విషయం తెలుసుకున్న మయాంక్..‌ తన ట్వీట్‌ను వెంటనే డిలీట్‌ చేశాడు.

కొత్త జీవితాన్ని ప్రారంభించాం

కొత్త జీవితాన్ని ప్రారంభించాం

అంతకుముందు జస్ప్రీత్ బుమ్రా పెళ్లి ఫొటోలు పోస్ట్ చేసి ఓ ట్వీట్ చేశాడు. 'ప్రేమ.. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మీరు అదృష్టవంతులే. అదే మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. మేం ఇద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఈ రోజు మా జీవితాల్లో అత్యంత సంతోషకరమైన రోజు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది' అని బుమ్రా పేర్కొన్నాడు. ఆపై మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా, వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ అందరూ బుమ్రా దంపతులను దీవిస్తూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

ప్రముఖులందరికి విందు

ప్రముఖులందరికి విందు

అత్యంత సన్నిహితుల మధ్యనే వివాహం చేసుకున్న బుమ్రా.. త్వరలోనే భారత క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులందరికి విందు ఇవ్వనున్నట్లు వారి కుటుంబ వర్గాలు తెలిపాయి. భారత్-ఇంగ్లండ్ మధ్య మార్చి 23 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌లోనూ బుమ్రా ఆడటంపై సందేహాలు ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరగనున్న విషయం తెలిసిందే. అందులో బుమ్రా ఆడనున్నాడు. గత ఏడాది ముంబై ఇండియన్స్ టైటిల్స్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.

 పెళ్లి కోసమే:

పెళ్లి కోసమే:

పెళ్లి కోసం బుమ్రా ఇంగ్లండ్‌తో చివరి టెస్టుతో పాటు.. ప్రస్తుతం జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం గురించి గోప్యత పాటించిన బుమ్రా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నట్లు బీసీసీఐతో చెప్పించాడు. కానీ మీడియా ఆరా తీయగా.. అతను వివాహం చేసుకుంటున్నాడని తెలిసింది. అయితే వధువు ఎవరన్న విషయంలో కొంత గందరగోళం ఏర్పడింది. తొలుత సౌతిండియన్ స్టార్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ అని ప్రచారం జరిగినా.. ఆ తర్వాత స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనాని బుమ్రా వివాహం చేసుకోబుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరి మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహరం నడిచింది.

నాకు అసలు ఆ అలవాటు లేదు.. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదేశించాక తప్పలేదు: ఇషాన్‌ కిషన్‌

Story first published: Tuesday, March 16, 2021, 11:20 [IST]
Other articles published on Mar 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+