For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాకు అసలు ఆ అలవాటు లేదు.. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆదేశించాక తప్పలేదు: ఇషాన్‌ కిషన్‌

Ishan Kishan said I raised my bat after Virat Kohli told me after scoring 50

అహ్మదాబాద్: టీమిండియా యువ బ్యాట్స్‌మన్ ఇషాన్‌ కిషన్.. అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టేశాడు. రెండో టీ20లో తానాడిన తొలి బంతినే బౌండరీకి పంపిన కిషన్.. ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్‌ చేశాడు. ఆడేది తొలి మ్యాచ్ అయినా.. చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. లక్ష్య చేధనలో కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి ధీటుగా బ్యాటింగ్ చేశాడు. ఆదిల్ రషీద్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది అంతర్జాతీయ క్రికెట్లో తొలి అర్ధ సెంచరీ (56; 32 బంతుల్లో 5×4, 4×6) చేశాడు. ఏ బ్యాట్స్‌మన్‌ అయినా ఫిఫ్టీ మార్క్ అందుకోగానే.. బ్యాట్‌ పైకి ఎత్తుతాడు. ఇక అరంగేట్రం చేసిన బ్యాట్స్‌మన్ హాఫ్ సెంచరీ బాదితే.. అతడి సంతోషానికి అవధులు ఉండేవాడు. కానీ ఇషాన్‌ కిషన్ మొదటగా ఇవేమీ చేయలేదు.

బ్యాట్‌ ఎత్తే అలవాటు లేదు:

బ్యాట్‌ ఎత్తే అలవాటు లేదు:

తాజాగా మణికట్టు స్పిన్నర్, అల్లరి పిల్లాడు యుజ్వేంద్ర చహల్.. ఇషాన్‌ కిషన్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా ఇషాన్‌ పలు విషయాలు పంచుకున్నాడు. 'నిజం చెప్పాలంటే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేరుకున్నానని నాకు తెలియదు. గొప్ప ఇన్నింగ్స్‌ ఆడావని విరాట్ భాయ్ నాతో అన్న తర్వాతే తెలిసింది. ఫిఫ్టీ తర్వాత నాకు బ్యాట్‌ ఎత్తే అలవాటు లేదు. అయితే కోహ్లీ.. 'బ్యాట్‌ ఎత్తి మైదానంలోని నలువైపులకు చూపెట్టు. ఇది నీ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌' అని వెనకాల నుంచి అరిచాడు. ఆ తర్వాతే బ్యాట్‌ ఎత్తి అందరికి అభివాదం చేశా. ఎందుకంటే.. అది కెప్టెన్‌ ఆదేశంగా భావించా' అని ఇషాన్‌ తెలిపాడు.

మొదట్లో ఇబ్బంది పడ్డా:

మొదట్లో ఇబ్బంది పడ్డా:

'విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడితో కలిసి బ్యాటింగ్‌ చేయడం కొత్త అనుభూతినిచ్చింది. తొలి మ్యాచులోనే విరాట్ భయ్యాతో కలిసి ఆడుతానని ఊహించలేదు. అతని స్థాయిని అందుకోవడానికి మొదట్లో ఇబ్బంది పడ్డా. అత్యున్నత స్థాయిలో రాణించాలంటే ఎలాంటి శరీర భాష ఉండాలో అర్థం చేసుకున్నా' అని ఇషాన్‌ కిషన్‌ చెప్పాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య మంగళవారం రాత్రి 7 గంటలకి మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందులో కూడా ఇషాన్ ఓపెనింగ్ చేయనున్నాడు. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ వరుసగా 1, 0 పరుగులు చేసి నిరాశపర్చిన కేఎల్‌ రాహుల్‌ స్థానంలో రోహిత్‌ శర్మ ఆడే వీలుంది.

భారత జెండాను చూశాక:

భారత జెండాను చూశాక:

తాను ఇక్కడిదాకా రావడానికి ఎంతో మంది కృషి చేశారని, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తనకు అండగా నిలిచాడన్నాడు. 'మ్యాచ్‌కు ముందు రోహిత్‌ భాయ్‌ నా వద్దకు వచ్చి.. నున్వ్ ఈరోజు ఓపెనింగ్‌ చేస్తున్నావన్నాడు. ఎలాంటి ఆందోళనా లేకుండా ఐపీఎల్‌లో ఆడినట్లే ఇక్కడా ప్రశాంతంగా ఆడమని చెప్పాడు. కానీ బరిలోకి దిగినప్పుడు మాత్రం ఆందోళనకు గురయ్యా. చివరికి జెర్సీ ధరించి భారత జెండాను చూశాక.. ఏదేమైనా అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకున్నా' అని కిషన్‌ పేర్కొన్నాడు.

ఆ ప్రదర్శనే భారత జట్టులో చోటు దక్కేలా చేసింది:

ఆ ప్రదర్శనే భారత జట్టులో చోటు దక్కేలా చేసింది:

ఝార్ఖండ్‌కు చెందిన ఇషాన్‌ కిషన్‌ ఎడమచేతివాటం వికెట్‌కీపర్‌ కమ్ బ్యాట్స్‌మన్‌. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించాడు. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రెండేళ్ల పాటు ముంబై ఇండియన్స్ తరఫున నిలకడగా పరుగులు చేస్తున్నాడు. నిర్భయంగా క్రికెట్‌ ఆడుతూ భారీ సిక్సర్లు బాదడం అతడి శైలి. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై వరుసగా రెండు ట్రోఫీలు గెలవడంలో కిషన్‌ పాత్ర ఎంతో ఉంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో కిషన్.. 145.76 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 516 పరుగులు చేశాడు. ఇందులో 36 ఫోర్లు, 30 సిక్సర్లు ఉండటం గమనార్హం. ఆ ప్రదర్శనే భారత జట్టులో చోటు దక్కేలా చేసింది.

Story first published: Tuesday, March 16, 2021, 10:14 [IST]
Other articles published on Mar 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+