Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Jasprit Bumrah love story: ఐపీఎల్‌తో మొదలై ప్రపంచకప్‌తో ఒక్కటైన బుమ్రా-సంజనా!

జస్‌ప్రీత్ బుమ్రా.. అంతగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రతీ క్రికెట్ అభిమానికి బుమ్రా వేసే యార్కర్లు, బ్యాటర్లను వణించి బౌలింగ్ సుపరిచితమే. వరల్డ్ బెస్ట్ పేసర్‌గా కొనసాగుతున్న బుమ్రా.. వ్యక్తిగత జీవితాన్ని అంతే సంతోషంతో గడుపుతున్నాడు. స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న బుమ్రా.. గతేడాదే అంగద్ బుమ్రాకు జన్మనిచ్చాడు.

టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ తరఫున బుమ్రా నిప్పులు చెరుగుతుండుగా.. మరోవైపు అతని సతీమని స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా తన మాటలతో అభిమానులను అలరిస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్ అనంతరం ఈ జోడీ సరదాగా చిట్ చాట్ చేసి అభిమానులకు కావాల్సిన నవ్వులను పంచింది. దాంతో ఈ ఇద్దరి లవ్ స్టోరీ తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు.

Jasprit Bumrah love story

2013లో తొలిసారి..
అందరి ప్రేమ కథల్లానే బుమ్రా-సంజనా లవ్ కూడా స్నేహంతోనే మొదలైంది. ఐపీఎల్ 2013 సీజన్‌లో బుమ్రా-సంజనా తొలిసారి కలుసుకున్నారు. ఆ సీజన్‌ ఫైనల్లో సీఎస్‌కేపై ముంబై ఇండియన్స్ విజయం సాధించి తొలి టైటిల్‌ను అందుకుంది. ఆ సమయంలో స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా ఉన్న సంజనా గణేషన్.. ముంబై విజయానంతరం ఆ జట్టు ఆటగాళ్లను ఇంటర్వ్యూ చేసింది.

ఈ క్రమంలోనే తొలిసారి బుమ్రాను చూడటంతో పాటు అతనితో మాట్లాడింది. ఆ సీజన్‌లో బుమ్రా సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ పరిచయంతో బుమ్రా-సంజనాల మధ్య స్నేహం మొదలైంది.

2019 వన్డే ప్రపంచకప్‌తో
ఆ తర్వాత చాలా ఏళ్లు ఈ ఇద్దరూ స్నేహితులుగానే ఉన్నారు. కలిసిప్పుడు హాయ్, భాయ్ చెప్పుకునేవారు. అయితే 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఈ ఇద్దరి స్నేహం మరో అడుగు వేసింది. ఇంగ్లండ్ వేదికగా ఈ టోర్నీలో సంజనా గణేషన్ స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా వ్యవహరించింది. ఈ సమయంలో బుమ్రా-సంజనా‌లు మ్యాచ్‌లు లేని సమయంలో ఒకరినొకరు కలుసుకునేవారు. దాంతో వీరి స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది.

రెండేళ్ల పాటు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన ఈ ఇద్దరూ బాహటంగానే కలిసి తిరిగారు. చివరకు కరోనా లాక్‌డౌన్ సమయంలో తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు. 2021 మార్చి 15న పెళ్లి చేసుకున్నారు. సిక్కు సంప్రదాయంలో ఈ ఇద్దరి వివాహం జరిగింది. గతేడాది సెప్టెంబర్ 4న ఈ ఇద్దరికి ఓ కుమారుడికి జన్మించాడు. ప్రస్తుతం వీరి సంసార జీవితం సాఫిగా సాగుతోంది.

Story first published: Tuesday, June 18, 2024, 23:49 [IST]
Other articles published on Jun 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+