For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: కోహ్లీసేనకు ఎదురుదెబ్బ.. గాయంతో మైదానం వీడిన జస్‌ప్రీత్ బుమ్రా!

Jasprit Bumrah Leaves The Field With Injury Big Blow For Team India

సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో మైదానం వీడాడు. సౌతాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ యార్కర్ల కింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. కాలు జారడంతో అతని యాంకిల్ మర్లబడింది. నొప్పితో విలవిలలాడిన బుమ్రా మైదానంలో కుప్పకూలిపోయాడు. వెంటనే భారత ఫిజియో నితిన్ పటేల్ మైదానంలోకి వచ్చి బుమ్రా గాయాన్ని పరీక్షించాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో బుమ్రాను బయటకు తీసుకెళ్లాడు. బుమ్రా కుంటుకుంటూనే మైదానం వీడాడు. టీమిండియా ప్రధాన పేసర్ అయిన బుమ్రా సేవలను కోల్పోవడం భారత్‌కు నష్టమే.

 అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన బుమ్రా.. ఐదో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌గా వేయగా.. బ్యాట్స్‌మన్ డర్ డస్సెన్ డిఫెండ్ చేశాడు. అయితే యాక్షన్ పూర్తి చేసుకునే క్రమంలో బుమ్రా కాలు మర్లబడింది. దాంతో అతని చీలమండకు గాయమైంది. గాయపడ్డ తీరును చూస్తే తీవ్ర గాయంగానే కనిపిస్తుంది. ముందస్తు చర్యల్లో భాగంగా అతని గాయానికి స్కానింగ్ తీయనున్నారు. ఆ తర్వాత క్లారిటీ రానుంది. గాయం తీవ్రమైతే మాత్రం సౌతాఫ్రికా పర్యటన నుంచి బుమ్రా తప్పుకుంటాడు. మిగిలిపోయిన బంతిని సిరాజ్ పూర్తి చేశాడు. ఇప్పటి వరకు 5.5 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా ఓ వికెట్ కూడా తీసాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఫుల్ జోష్‌లో ఉన్న బుమ్రా ఇలా గాయంతో దూరమవడం టీమిండియా అభిమానులను నిరాశపరిచింది.

చెలరేగుతున్న షమీ..

చెలరేగుతున్న షమీ..

ఇక బుమ్రా సేవలను కోల్పోయినా.. భారత్ పేసర్లు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ చెలరేగుతున్నారు. ఇప్పటికే షమీ రెండు కీలక వికెట్లు తీశాడు. ఈ రెండు కూడా క్లీన్ బౌల్డ్ చేయడం గమనార్హం. ముందుగా కీగన్ పీటర్సన్(15)ను బౌల్డ్ చేసిన షమీ.. ఆ తర్వాత ఎయిడెన్ మార్కర్‌మ్‌ను కూడా అదే తరహాలో పెవిలియన్‌కు చేర్చాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మన్ షమీ బౌలింగ్‌కు బిత్తరపోయారు. నిరాశగా పెవిలియన్ చేరారు. పిచ్ నుంచి సహకారం లభిస్తుండటంతో భారత పేసర్లు చెలరేగుతున్నారు. షమీకి తోడుగా సిరాజ్ కూడా రాణించాడు. వాన్ డర్ డస్సెన్ స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన క్వింటన్ డికాక్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను స్లిప్‌లో కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. భారత బౌలర్ల ధాటికి 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది.

 భారత్ 327 ఆలౌట్..

భారత్ 327 ఆలౌట్..

అంతకు ముందు 272/3 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 327 పరుగులకు కుప్పకూలింది. సౌతాఫ్రికా పేస్ ద్వయం కగిసో రబడా(3/72), లుంగి ఎంగిడి(6/71) చెలరేగడంతో 55 పరుగుల వ్యవధిలోనే భారత్ మిగిలిన 7 వికెట్లు కోల్పోయింది. సెంచరీ హీరో కేఎల్ రాహుల్(260 బంతుల్లో 17 ఫోర్లు, సిక్స్‌తో 123)‌, అజింక్యా రహానే (102 బంతుల్లో 9 ఫోర్లతో 48)‌ వెనువెంటనే ఔటవ్వడంతో భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. వచ్చిన రవిచంద్రన్ అశ్విన్(4), రిషభ్ పంత్(8)తో పాటు శార్దూల్ ఠాకూర్(4), మహమ్మద్ షమీ(4), జస్‌ప్రీత్ బుమ్రా(14) వరుసగా ఔటయ్యారు. సిరాజ్(4 నాటౌట్) అజేయంగా నిలిచాడు.

Story first published: Tuesday, December 28, 2021, 17:16 [IST]
Other articles published on Dec 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+