బుమ్రా బెస్ట్ బౌలర్... నేను కూడా ఎదుర్కోలేను: కోహ్లీ

మెల్‌బౌర్న్: ఆస్ట్రేలియాతో తలపడి విజయం సాధించడం పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. అన్ని విభాగాల్లో రాణించడంతోనే మ్యాచ్ గెలిచామని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో తన జట్టు ప్లేయర్లను ప్రోత్సహించాడు. బాక్సింగ్ డే టెస్టులో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టిన స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో బుమ్రా అత్యుత్తమ బౌలర్ అంటూ కితాబిచ్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తొమ్మిది వికెట్లతో సత్తాచాటిన ఈ యార్కర్ స్పెషలిస్టు.. ఆసీస్ పతనాన్ని శాసించడంలో కీలకంగా వ్యవహరించాడు.

ప్రపంచంలోనే బుమ్రా బెస్ట్ బౌలర్
మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ ప్రపంచంలో బుమ్రా బెస్ట్ బౌలర్. అతనో మ్యాచ్ విన్నర్, అందులో ఎలాంటి సందేహం లేదు. కేవలం 12నెలల్లోనే టెస్టుల్లో బుమ్రా ఈ స్థాయికి చేరుకోవడం నిజంగా అద్భుతం. పెర్త్‌లాంటి పేస్ పిచ్‌పై గనుక అతని బౌలింగ్‌ను ఎదుర్కొవడం నాకైతే చాలా కష్టమని నిజాయతీ చెప్పగలను. వైవిధ్యమైన బంతులు ఎదుర్కొవాలంటే అంత సులువు కాదు. మిగతా బౌలర్లతో పోల్చుకుంటే వేగానికి తోడు బంతి బంతికి వైవిధ్యాన్ని ప్రదర్శించే బుమ్రా.. మెండైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తాడు.
కెప్టెన్‌లానే మైదానంలో ప్లేయర్లతో ఆర్కీ చిల్లర్

అత్యుత్తమ ఫిట్‌నెస్ తోడు కష్టపడే తత్వం
పిచ్‌ను ఓసారి పరిశీలించాడంటే.. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించుకుని బౌలింగ్‌కు దిగుతాడు. అత్యుత్తమ ఫిట్‌నెస్ లక్షణాలకు తోడు కష్టపడే తత్వం బుమ్రా సొంతం. అతను ఈస్థాయికి చేరుకోవడానికి వెనుక ఎంతో శ్రమ దాగుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు పరిమితం గాకుండా టెస్ట్‌ల్లోనూ సత్తాచాటాలన్న పట్టుదలే టెస్ట్‌ల్లో బుమ్రాను ప్రమాదకర బౌలర్‌గా మార్చింది. కెప్టెన్ ఆలోచనలు, వ్యూహాలకు అనుగుణంగా ప్రత్యర్థిని కట్టడి చేయడంలో ఈ యువ బౌలర్ ఎప్పుడూ ముందుంటాడు.

ఏ బ్యాట్స్‌మెన్ అయినా భయపడాల్సిందే
అతని ఫామ్‌ను చూస్తుంటే... ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ అయినా భయపడాల్సిందే. జట్టు బౌలింగ్ సమావేశాల్లో అంతగా మాట్లాడను. మైదానంలో వారి బౌలింగ్‌కు సరిపోయేటట్లు ఫీల్డర్లను మోహరించేందుకు సిద్ధంగా ఉంటాను. సమష్టిగా అందరు రాణిస్తుండటం వల్లనే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని కోహ్లీ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications