Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నేను చూసిన ఉత్తమ భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రానే'

Jasprit Bumrah Is The Best Indian Fast Bowler I Have Ever Seen Says Andy Roberts
Jasprit Bumrah is the best Indian fast bowler I have ever seen says Andy Roberts

హైదరాబాద్: ఇప్పటివరకు నేను చూసిన ఉత్తమ భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రానే అని వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్ పేర్కొన్నారు. ఆంటిగ్వాలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో నిప్పులు చెరిగే బంతులతో విండీస్ బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించాడు. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్‌ను ఓ అద్భుత స్పెల్‌తో ( 5/7) కకాలవికాలం చేసాడు. బుమ్రా దెబ్బకు విండీస్ 100 పరుగులకే ఆలౌట్ అయింది.

టీంఇండియాకు ఇలాంటి బౌలర్ మళ్లీ దొరకడు:

టీంఇండియాకు ఇలాంటి బౌలర్ మళ్లీ దొరకడు:

తాజాగా ఆండీ రాబర్ట్స్ మాట్లాడుతూ... 'నేను క్రికెట్ మైదానంలో చూసిన వింతైన బౌలింగ్ యాక్షన్ ఇది. బుమ్రా బౌలింగ్ శైలిని అర్థం చేసుకోవడానికి చాలా సమయం అధ్యయనం చేయాలి. మా రోజుల్లో అతను ఉంటే మా బౌలింగ్ లైనప్‌లో సరిపోయేవాడు. బుమ్రా లాంటి బౌలర్‌ను మేము ఎప్పుడూ కలిగి లేము. టీంఇండియాకు కూడా ఇలాంటి బౌలర్ మళ్లీ దొరకడు అని నేను అనుకుంటున్నా' అని ఆండీ రాబర్ట్స్ అభిప్రాయపడ్డారు.

 ఉత్తమ భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రానే:

ఉత్తమ భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రానే:

'మా కాలంలో టీమిండియాకు చాలా మంది స్పిన్ బౌలర్‌లున్నారు. వారు విదేశాలలో మ్యాచ్‌లు గెలవలేదు. టీమిండియాలో కపిల్ దేవ్ మరికొందరు పేస్ బౌలర్‌లు ఉన్నారు. కానీ.. బుమ్రా లాంటి వారు లేరు. ఇప్పటివరకు నేను చూసిన ఉత్తమ భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రానే. పర్ఫెక్ట్ లెంగ్త్, సరైన ఏరియాల్లో బంతిని వేస్తున్నాడు. చాలా మంది బౌలర్‌లు అలా బౌలింగ్ చేయరు' అని రాబర్ట్స్ పేర్కొన్నారు.

పేస్ చాలా ముఖ్యం:

పేస్ చాలా ముఖ్యం:

బ్రాత్‌వైట్, జాన్ కాంప్‌బెల్‌ను ఔట్ చేసిన డెలివరీ గురించి రాబర్ట్స్ మాట్లాడుతూ.. 'అది క్రూరమైన బంతి. అలాంటి బంతులకు ఎవరూ ఏం చేయలేరు. మా రోజుల్లో మైఖేల్ హోల్డింగ్ అలా బౌలింగ్ చేసేవాడు. ఆ తర్వాత మాల్కం మార్షల్ కూడా ఉత్తమ బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేసేవాడు. పేస్ ఫాస్ట్ బౌలర్ యొక్క ప్రధాన అస్రం అని నేను అనను, కానీ ఇది చాలా విలువైనది. పేస్ ఉంటే బ్యాట్స్‌మన్‌ భయపడతారు. ఎందుకంటే మనసులో వారు భద్రత గురించి ఆలోచిస్తారు కాబట్టి' అని చెప్పుకొచ్చారు.

నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా.. బీసీసీఐ పెద్దల ఫోన్‌ నంబర్లు ట్రాప్!!

బుమ్రా @ టాప్‌10:

బుమ్రా @ టాప్‌10:

తొలి టెస్టులో అత్యద్భుత బౌలింగ్‌ ప్రదర్శన చేసిన బుమ్రా కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసిన బౌలర్‌ల తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా తొమ్మిది స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. 774 రేటింగ్‌ పాయింట్లతో బుమ్రా ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. ఇప్పటివరకు బుమ్రా అత్యుత్తమ ర్యాంక్‌ 15.

Story first published: Wednesday, August 28, 2019, 14:50 [IST]
Other articles published on Aug 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+