జస్ప్రీత్ బుమ్రా పెళ్లి చేసుకునేది ఆ హీరోయిన్‌నేనా?

హైదరాబాద్: టీమిండియా స్టార్ పేసర్, స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా.. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని మొతేరా మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచుకు దూరమయిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో టీ20, వన్డే సిరీస్‌ల నుంచి కూడా అతడు వైదొలిగాడు. పెళ్లి కారణంగానే బుమ్రా జట్టుకు దూరమయినట్టు సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం బుమ్రా తన సొంతూరు గుజరాత్‌లో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ వర్గాలు కూడా ఇదే విషయాన్ని ప్రకటించినట్లు జాతీయ న్యూస్ మీడియా ఏఎన్ఐ స్పష్టం చేసింది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

బుమ్రా పెళ్లి అనుపమతోనేనా
అయితే జస్ప్రీత్ బుమ్రా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తుంది. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌తో బుమ్రా వివాహం జరగనుందంటూ నెటిజన్స్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అందుకు కూడా కారణం లేకపోలేదు. అనుపమ గుజరాత్‌కు వెళ్లడం.. అందుకు సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈ వదంతులు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. గతంలో బుమ్రా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని అనుపమ బహిరంగంగానే చెప్పడం, బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫాలో అయ్యే ఒకే ఒక్క హీరోయిన్ అనుపమనే కావడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఏ ఫోటోనూ బయటికి రాలేదు
కొన్నాళ్లుగా జస్ప్రీత్ బుమ్రా, అనుపమ పరమేశ్వరన్ మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటిదాకా వీరిద్దరూ కలిసి తిరిగినట్లు ఏ ఫోటోనూ బయటికి రాలేదు. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లి వార్తలే నెట్టింట్లో గుప్పుమనడంతో ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే. ఏదేమైనా 27 ఏళ్ల బుమ్రా పెళ్లిచేసుకోవడం మాత్రం ఖాయం. అయితే వధువు ఎవరన్నది స్పష్టత రావాల్సి ఉంది. భారత్ తరఫున బుమ్రా మూడు ఫార్మాట్లలో ఆడుతున్న విషయం తెలిసిందే. భారత్ తరఫున 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20లు ఆడాడు.

గోవాలో పెళ్లి
గోవాలో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో జస్ప్రీత్ బుమ్రా పెళ్లి జరగుతుందని సమాచారం. ఈ కార్యక్రమానికి బుమ్రా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారట. పెళ్లి తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుక నిర్వహించే అవకాశం కూడా ఉంది. దీనికి సహచర ఆటగాళ్లతో పాటు అతిరథ మహారథులను ఆహ్వానించవచ్చునని తెలుస్తోంది.

బిజీ షెడ్యూల్
ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్ ముగిసిన అనంతరం టీ20, వన్డే సిరీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఐపీఎల్ 2021 ఉంది. ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ జట్టుకు జస్ప్రీత్ బుమ్రా కీలక బౌలర్. ఆ వెంటనే జూన్‌లోనే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ జరగనుంది. ఇక అక్టోబరు-నవంబరులో టీ20 ప్రపంచకప్ ఉంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య ఖాళీ సమయమే లేదు. అందుకే పెళ్లికి ఇదే తగిన సమయం అని బుమ్రా భావించినట్లు సమాచారం తెలుస్తోంది.
India vs England: శుభ్‌మన్ గిల్ వైఫల్యానికి కారణం అదే: గవాస్కర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications