For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అసలు బుమ్రా ఫిట్‌గా ఉన్నాడా? మాటి మాటికి ఈ నొప్పులు ఏంది? ఫ్యాన్స్ ఫైర్!

Jasprit Bumrah fitness is big concern for India before World Cup 2022

హైదరాబాద్: సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా శుభారంభం చేసింది. బుధవారం తిరువనంతపురం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సంచలన బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఫిట్‌నెస్ కారణాలతో ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చివరి నిమిషంలో దూరమయ్యాడు.

ప్రపంచకప్‌కు మరో 20 రోజుల ఉన్న నేపథ్యంలో భారత స్టార్ పేసర్ బుమ్రా ఇలా తరుచూ ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటుండటం అభిమానులను కలవరపడేలా చేస్తోంది. వెన్ను నొప్పితో ఆసియాకప్ మొత్తానికి దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా.. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాడు.

వెన్ను నొప్పితో..

ఈ సిరీస్‌లోనూ ఫిట్‌నెస్ సమస్యలతో తొలి మ్యాచ్ ఆడని బుమ్రా.. చివరి రెండు మ్యాచ్‌లు ఆడి పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు కూడా ఎంపికైన బుమ్రా.. అనూహ్యంగా తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న బుమ్రా వెన్ను నొప్పి ఉందని ఫిజియోలకు చెప్పాడంతో అతనికి విశ్రాంతించారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. 'మంగళవారం ప్రాక్టీస్ సెషన్ సమయంలో వెన్ను నొప్పిగా ఉందని బుమ్రా చెప్పాడు. దీంతో బీసీసీఐ మెడికల్ టీ20 అతణ్ని పరీక్షించింది. తొలి టీ20కి అందుకే అతడు దూరమయ్యాడు'అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

ఫిట్‌గా లేడు..

ఇలా వెన్ను నొప్పితో బుమ్రా పదే పదే జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు రెట్టింపు అవుతున్నాయి. ఆసీస్‌తో పర్యటనకు ముందే బుమ్రాతో పాటు హర్షల్ పటేల్‌కు ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్‌లో పాసైనట్లు కూడా పేర్కొన్నారు.

హర్షల్ సంగతి పక్కనబెడితే.. ఆసీస్‌తో తొలి మ్యాచ్ లో బుమ్రాను ఆడించలేదు. దీంతో అసలు అతడు పూర్తి ఫిట్ గా ఉన్నాడా..? అనే అనుమానాలు తలెత్తాయి. కానీ రెండో మ్యాచ్ లో బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు. రావడమైతే వచ్చాడు గానీ బుమ్రా లో మునపటి లయ లేదు. రెండో టీ20లో రెండు ఓవర్లు వేసి 25 పరుగులిచ్చాడు.

ప్రపంచకప్ కోసమే..

ఇక మూడో మ్యాచ్ లో కూడా నాలుగు ఓవర్లు వేసి 50 ప్లస్ రన్స్ సమర్పించుకున్నాడు. దాంతో అతను ఫిట్‌గా లేడనే విషయం అర్థమవుతోంది. ఇవన్నీ చూస్తుంటే బుమ్రాను ప్రపంచకప్ కోసమే హడావిడిగా ఎంపిక చేసినట్టు అనిపిస్తున్నదని ఫ్యాన్స్ వాపోతున్నారు. అసలు బుమ్రా పూర్తిస్థాయిలో ఫిట్నెస్ అందుకున్నాడా..? అందుకుంటే పదే పదే మళ్లీ వెన్నునొప్పి వంకతో మ్యాచ్ లు ఎందుకు ఆడటం లేదు..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఐపీఎల్‌కు మాత్రం ఫిట్..

బుమ్రా తీరుపై కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా మ్యాచ్‌లు మిస్సవ్వడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశం.. కానీ అతడు ముంబై ఇండియన్స్ తరఫున 14 మ్యాచ్‌ల్లో ఆడగలగడు అంటూ పేసర్‌పై ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. జూలై నుంచి ఆడని బుమ్రాకు వెన్ను గాయం ఎలా అయ్యిందని ప్రశ్నిస్తున్నారు. జులైలో ఇంగ్లండ్ పర్యటన అనంతరం వెస్టిండీస్ సిరీస్‌కు బుమ్రా విశ్రాంతి తీసుకున్నాడు. వన్డేలతో పాటు టీ20లలో కూడా బుమ్రా ఆడలేదు. ఆ తర్వాత భారత్ ద్వితియశ్రేణి జట్టు.. జింబాబ్వేలో కూడా పర్యటించింది. ఆ సిరీస్ లో కూడా బుమ్రా ఆడ లేదు. ఆసియాకప్‌కు వెన్ను నొప్పితో దూరమయ్యాడు.

Story first published: Thursday, September 29, 2022, 13:40 [IST]
Other articles published on Sep 29, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+