For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2020లో విఫలం.. 9 మ్యాచ్‌ల్లో 5 వికెట్లే!! పేసు‌ గుర్రం బుమ్రాకి ఏమైంది!

Jasprit Bumrah ended 2020 with only 5 ODI wickets in 9 Matches

హైదరాబాద్: జస్ప్రీత్ బుమ్రా.. ఈ పేరు గురించి సగటు క్రికెట్ అభిమానికి ప్రత్యేకంగా చెప్పాల్సినఅవసరం లేదు. ప్రపంచ టాప్ బౌలర్లలో ఒకడు. పవర్‌ప్లే, డెత్‌ఓవర్ల స్పెషలిస్టు. తన యార్కర్లతో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించగల బౌలర్. బ్యాట్స్‌మన్‌ ఎవరైనా బుమ్రా బంతికి బలవ్వాల్సిందే. కెరీర్ ఆరంభం నుంచి బుమ్రా మంచి ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్ బంతిని ఇచ్చిన ప్రతిసారి వికెట్లు తీసి.. తనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకున్నాడు. యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2020లో 27 వికెట్లతో చెలరేగిపోయాడు. అంతలా రెచ్చిపోయిన బూమ్.. బూమ్.. ఈ ఏడాదిని మరీ ఘోరంగా ముగించాడు. 2020లో ఆడిన వన్డే క్రికెట్‌లో పూర్తిగా నిరాశపరిచాడు.

9 మ్యాచ్‌ల్లో 5 వికెట్లే:

9 మ్యాచ్‌ల్లో 5 వికెట్లే:

జస్ప్రీత్ బుమ్రా ఈ ఏడాది మొత్తం 9 వన్డేలు ఆడాడు. 9 మ్యాచ్‌ల్లో తీసింది 5 వికెట్లే. ఇక అన్ని మ్యాచ్‌ల్లో కొత్త బంతితో ఒక్క పవర్‌ప్లేలోనూ వికెట్‌ తీయలేకపోయాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా.. భారత పర్యటన సందర్భంగా మూడు వన్డేల సిరీస్‌లో ఒక్క వికెట్‌ మాత్రమే తీసిన బుమ్రా.. తర్వాత న్యూజిలాండ్‌ పర్యటనలో మూడు వన్డేల్లో పూర్తిగా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అంతేకాక దారుణంగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఒకవిధంగా చెప్పాలంటే.. బుమ్రా విఫలం కావడంతోనే టీమిండియా ఆ సిరీస్ కోల్పోయింది.

2016 నుంచి ఎప్పుడూ ఇలాంటి చెత్త ప్రదర్శన లేదు:

2016 నుంచి ఎప్పుడూ ఇలాంటి చెత్త ప్రదర్శన లేదు:

లాక్‌డౌన్‌ తర్వాత ఐపీఎల్ 2020‌లో ముంబై ఇండియన్స్ తరఫున 27 వికెట్లతో మెరిసినా.. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. తొలి రెండు వన్డేల్లో ఒక్కొక్క వికెట్‌ తీయగా.. మూడో మ్యాచ్‌లో రెండు వికెట్లతో మెరిశాడు. దీంతో ఈ ఏడాది మొత్తం 5 వికెట్లే తీయడం గమనార్హం. 2016 నుంచి బుమ్రా ఎప్పుడూ ఇలాంటి ప్రదర్శన చేయలేదు. 9 మ్యాచుల్లో మొత్తం 85.4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 5 వికెట్లే పడగొట్టాడు. ఇక వన్డేల్లో తొలి పవర్‌ప్లే ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా పడగొట్టకుండా ఈ ఏడాదిని బుమ్రా ముగించాడు. 2020లో పవర్‌ప్లేలో మొత్తం 34 ఓవర్లు బౌలింగ్‌ చేసిన బుమ్రా వికెట్‌ తీయలేకపోవడం గమనార్హం.

వెన్నెముకకు గాయం:

వెన్నెముకకు గాయం:

గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత బుమ్రా వెన్నెముక గాయంతో ఇబ్బందిపడ్డాడు. లండన్‌లో శస్త్రచికిత్స తీసుకొని కొద్దికాలం ఆటకు దూరమయ్యాడు. మళ్లీ జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొంది ఫిట్‌నెస్‌ సాధించడంతో.. 2020 జనవరిలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. కోలుకున్నాక అదే తొలి సిరీస్‌ కావడంతో లయ అందుకోలేకపోయాడు. ఆపై న్యూజిలాండ్‌ పర్యటనలో పేలవమైన ప్రదర్శన చేశాడు. అయితే అక్కడి పరిస్థితులు భారత పేసర్లకు ఎప్పుడూ ప్రతికూలమే. దాంతో బుమ్రాను ప్రత్యేకంగా విమర్శించడానికి ఆస్కారం లేదు. కరోనా పరిస్థితుల కారణంతో అనుకోకుండా లభించిన లాక్‌డౌన్‌ సమయాన్ని ఈ పేసుగుర్రం చక్కగా వినియోగించుకున్నాడు. తగినంత విశ్రాంతి దొరకడంతో ఐపీఎల్‌కు మంచి ప్రణాళికతో సన్నద్ధమయ్యాడు. అలా టీ20 మెగా లీగ్‌లో అద్భుతం చేశాడు. 15 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు.

 బుమ్రా.. మార్క్ చూపించలేదు:

బుమ్రా.. మార్క్ చూపించలేదు:

బుమ్రా ఐపీఎల్ 2020లో మంచి ప్రదర్శనతో మునుపటి ఫామ్‌ అందుకున్నట్లు కనిపించినా.. ఆస్ట్రేలియాతో ఆడిన తొలి రెండు వన్డేల్లో విఫలయ్యాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆ రెండు మ్యాచ్‌ల్లో 73, 79 పరుగులిచ్చి ఒక్కొక్క వికెట్‌ మాత్రమే తీశాడు. అయితే మూడో వన్డేలో కాస్త పర్వాలేదనిపించాడు. 43 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. అయితే సిడ్నీ మైదానం బ్యాటింగ్‌ పిచ్ కాబట్టి బౌలర్లు రాణించిన లేవు. కాన్‌బెరాలో చెలరేగి ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. ఏదేమైనా 2020లో బుమ్రా తన మార్క్ చూపించలేదనే చెప్పాలి. ఇక శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి.

India vs Australia: మరో 29 పరుగులే.. ఎంఎస్ ధోనీ రికార్డుపై కన్నేసిన శిఖర్ ధావన్!!

Story first published: Thursday, December 3, 2020, 21:18 [IST]
Other articles published on Dec 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+