Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: బుమ్రా.. ఆ క్యాచ్ పట్టుంటే..!

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20లో న్యూజిలాండ్ 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే న్యూజిలాండ్ ఓపెనర్ టీమ్ సీఫెర్ట్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను బుమ్రా వదిలేయడం టీమిండియాకు నష్టం చేసింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్‌లో టీమ్ సీఫెర్ట్ భారీ షాట్ ఆడగా.. షార్ట్ థర్డ్‌లో ఫీల్డింగ్ చేసిన బుమ్రా వెనక్కి పరుగెత్తి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అందుకోలేకపోయాడు.

ఈ అవకాశంతో టీమ్ సీఫెర్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో న్యూజిలాండ్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. మరోవైపు కాన్వే కూడా దూకుడుగా ఆడటంతో న్యూజిలాండ్ 8.1 ఓవర్‌లోనే 100 పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన కాన్వేను క్యాచ్ ఔట్‌ చేసి తొలి వికెట్‌కు నమోదైన 100 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.

Jasprit Bumrah Dropped Catch of Tim Seifert Proves Costly in India vs New Zealand 4th T20I

ఆ తర్వాత రచిన్ రవీంద్ర(2)ను బుమ్రా, టీమ్ సీఫెర్ట్(62)ను అర్ష్‌దీప్ సింగ్, గ్లేన్ ఫిలిప్స్(24)ను కుల్దీప్ యాదవ్, మార్క్ చాప్‌మన్(9)ను రవి బిష్ణోయ్, మిచెల్ సాంట్నర్‌ను హార్దిక్ రనౌట్ చేయడంతో న్యూజిలాండ్ పరుగుల వేగం తగ్కింది. కానీ జాక్ ఫోక్స్(13), మ్యాట్ హెన్రీ(6 నాటౌట్) సాయంతో డారిల్ మిచెల్(39 నాటౌట్) చెలరేగాడు. ముఖ్యంగా హర్షిత్ రాణా బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడి జట్టుకు 214 పరుగుల భారీ స్కోర్ అందించాడు.

టీమ్ సీఫెర్ట్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌‌ను బుమ్రా అందుకొని ఉంటే న్యూజిలాండ్ తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా చెరో వికెట్ తీసారు. హర్షిత్ రాణా ఒక్క వికెట్ తీయకపోగా 54 పరుగులు సమర్పించుకున్నాడు.

Story first published: Wednesday, January 28, 2026, 21:30 [IST]
Other articles published on Jan 28, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+