Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs WI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఒకే ఓవర్‌లో కీలక వికెట్లు! (వీడియో)

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసాడు. స్టన్నింగ్ డెలివరీలతో డేంజరస్ బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మైర్(12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 27), రోస్టన్ ఛేజ్(25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40)‌లను పెవిలియన్ చేర్చాడు. బంతి వ్యవధిలోనే రెండు వికెట్లు తీసి టీమిండియాకు అదిరిపోయే బ్రేక్ త్రూ అందించాడు.

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 12వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతికి హెట్‌మైర్ క్యాచ్ ఔటయ్యాడు. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అతని రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి బ్యాట్‌తో పాటు అతని జెర్సీని ముద్దాడుతూ కీపర్ చేతిలో పడింది. అల్ట్రా ఎడ్జ్‌లో చిన్న స్పైక్ కనిపించడంతో హెట్‌మైర్‌ క్రీజును వీడక తప్పలేదు. అయితే హెట్‌మైర్‌తో పాటు వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ ఈ స్పైక్‌పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Jasprit Bumrah Double Strike Speedster Dismisses Dangerous Shimron Hetmyer and Roston Chase in Super 8 Clash

బుమ్రా బౌలింగ్‌లో హెట్‌మైర్ ఔటవ్వడం ఇది ఆరోసారి. క్రీజులోకి షెర్ఫేన్ రూథర్ ఫోర్డ్ రాగా.. సింగిల్ తీసి రోస్టన్ ఛేజ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఇదే ఓవర్‌ ఐదో బంతికి రోస్టన్ ఛేజ్ డిఫెన్స్ చేయగా బంతి గాల్లోకి లేచింది. ఫార్వార్డ్ ఫీల్డర్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా జంప్ చేసి బంతిని అందుకున్నాడు. దాంతో ఛేజ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో అతనికి 1, 19, వ్యక్తిగత స్కోర్ల వద్ద లైఫ్స్ లభించాయి. అర్ష్‌దీప్ సింగ్ వేసిన మూడో బంతికే అతను రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

వరుణ్ చక్రవర్తీ బంతిని కీపర్ వైపు అందించడంలో విఫలమయ్యాడు. బుమ్రా వేసిన ఐదో ఓవర్‌ ఐదో బంతికి రోస్టన్ ఛేజ్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను ఎక్స్‌ కవర్స్‌లో అభిషేక్ శర్మ నేలపాలు చేశాడు. ఈ క్యాచ్ పట్టి ఉంటే రోస్టన్ ఛేజ్ 19 పరుగులకే వెనుదిరిగేవాడు. ఎట్టకేలకు బుమ్రా తన మరుసటి ఓవర్‌లో ఛేజ్‌ను పెవిలియన్ చేర్చాడు.

Story first published: Sunday, March 1, 2026, 20:28 [IST]
Other articles published on Mar 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+