Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా.. అనిల్ కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు!

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఆల్‌టైమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో బుమ్రా మూడు వికెట్లు తీసాడు. అరంగేట్ర ప్లేయర్ సామ్ కోన్‌స్టాస్ ధాటికి ఆరంభంలో బుమ్రా తడబడ్డాడు. అతని ధాటికి మూడేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో సిక్సర్ సమర్పించుకున్నాడు. దాదాపు 4,483 బంతుల తర్వాత బుమ్రా బౌలింగ్‌లో సిక్స్‌ నమోదైంది. చివరిసారిగా 2021లో బుమ్రా సిక్సర్ ఇచ్చాడు. సామ్ కోన్‌స్టాస్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో తొలి 6 ఓవర్లలోనే బుమ్రా 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత పుంజుకున్న బుమ్రా.. కీలక భాగస్వామ్యాలను విడదీసాడు.

Jasprit Bumrah Creates History Breaks Anil Kumble s All-Time Record In Melbourne

ఉస్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), ట్రావిస్ హెడ్(0), మిచెల్ మార్ష్(4)లను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్(0)ను బుమ్రా డకౌట్ చేసిన విధానం ఈ ‌సిరీస్‌కే హైలైట్‌గా నిలిచింది. స్టన్నింగ్ ఇన్ స్వింగర్‌తో ట్రావిస్ హెడ్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఫ్ సైడ్ వెళ్తుందని భావించిన ట్రావిస్ ఆ బంతి వదిలేయగా.. లోపలికి స్వింగ్ అయిన బంతి ఆఫ్ స్టంప్ బెయిల్స్‌ను కిందపడేసింది.

మెల్ బోర్న్ క్రికెట్‌ స్టేడియంలో బుమ్రా తాజా మ్యాచ్‌తో కలుపుకొని మూడు టెస్ట్‌లు ఆడాడు. మొత్తం ఐదు ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. అనిల్ కుంబ్లే మూడు టెస్ట్‌లు, 6 ఇన్నింగ్స్‌ల్లో 15 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్(3 మ్యాచ్‌లు, 6 ఇన్నింగ్స్‌ల్లో 14), కపిల్ దేవ్(3 మ్యాచ్‌లు, 6 ఇన్నింగ్స్‌లు 14 వికెట్లు), ఉమేశ్ యాదవ్(3 మ్యాచ్‌లు, 6 ఇన్నింగ్స్‌లు 13 వికెట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లంతా భారత జట్టుకు దూరంగా ఉన్నారు. బుమ్రా ఈ రికార్డ్‌ను మరింత పదిలం చేసుకునే ఛాన్స్ ఉంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 86 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగుల భారీ స్కోర్ చేసింది. అరంగేట్ర ప్లేయర్ సామ్ కోన్‌స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), ఉష్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), మార్నస్ లబుషేన్(145 బంతుల్లో 7 ఫోర్లతో 72), స్టీవ్ స్మిత్(111 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 68 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు.. ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Thursday, December 26, 2024, 15:11 [IST]
Other articles published on Dec 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+