టీమిండియాకు బిగ్ షాక్.. టెస్ట్ ఫార్మాట్‌కు జస్‌ప్రీత్ బుమ్రా దూరం!
టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా ఒకే ఫార్మాట్‌కు పరిమితం కానున్నాడు. వరుస గాయాల నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత టీ20ల్లో మాత్రమే కొనసాగే అవకాశం ఉందని, అందుకు సిద్దంగా జట్టు ఉండాలని బీసీసీఐకి మెడికల్ టీమ్ సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది.
ఇంగ్లండ్ పర్యటనలో జస్‌ప్రీత్ బుమ్రా ఎడమ మోకాలికి గాయమైంది. దాంతో అతను ఇంగ్లండ్‌తో మూడో వన్డే ఆడలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. జూలై 16న కార్డిఫ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డే తర్వాత బుమ్రా బౌలింగ్ చేయలేదు. కార్డిఫ్ వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా అతనికి గాయమైందని, ఆ కారణంగా లార్డ్స్‌లో జరిగే ఫైనల్‌కు దూరమయ్యాడని బీసీసీఐ పేర్కొంది.

బుమ్రాను బీసీసీఐ మెడికల్ టీమ్, సీఓఈ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందని, అతను త్వరగా కోలుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. 'శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు బుమ్రా వర్క్‌లోడ్‌ను పెంచేందుకు సీఓఈ కృషి చేస్తోంది. అయితే అతను నిర్దేశించిన సమయానికి కోలుకోవడం అసంభవమని భావించారు. అతను టెస్ట్ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసి చాలా కాలమైంది.
బుమ్రా ఆరోగ్యం విషయంలో క్రికెట్ బోర్డు చాలా జాగ్రత్తగా ఉంది. అతని రీఎంట్రీ గురించి వారు ఇంకా ఎలాంటి కాలపరిమితిని ప్రకటించలేదు. ఏదేమైనా.. వచ్చే ఏడాది తర్వాత ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌ల్లో బుమ్రా లేని భవిష్యత్తుకు భారత క్రికెట్ సిద్ధం కావాలి.'అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. వన్డే ప్రపంచకప్ 2027 తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా కేవలం టీ20 ఫార్మాట్‌లోనే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. తన కెరీర్‌ను సుదీర్ఘ కాలం కొనసాగించేందుకే బుమ్రా ఒక్క ఫార్మాట్ ఎంచుకుంటాడనే అభిప్రాయం కలుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
జస్‌ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో టీమిండియా టెస్ట్‌ల్లో రాణించడం కష్టం. బుమ్రా స్థాయి బౌలర్‌ను భారత్ తయారు చేసుకోలేకపోయింది. భారత ప్రధాన ఆటగాళ్లంతా వరుసగా గాయాల బారిన పడుతుండటం సమస్యగా మారింది. భారత పేసర్ ఆకాశ్ దీప్ వెన్ను నొప్పితో గత 6 నెలలుగా క్రికెట్ ఆడలేదు. ఈ గాయం కారణంగా అతను ఐపీఎల్ 2026 సీజన్ అనంతరం జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లకు దూరమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

