న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా ఔట్.. భువనేశ్వర్‌, షమీ ఎంట్రీ! సూర్యకుమార్‌, ఇషాన్, రాణాకు ఛాన్స్!!

Jasprit Bumrah Could be rested for T20I and ODIs, Suryakumar Yadav may debut against England

చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు విజయం సాధించిన తర్వాత వన్డే, టీ20 జట్టుపై ఊహాగానాలు మొదలయ్యాయి. పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌లకు స్టార్ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు సమాచారం. పనిభారాన్ని తగ్గించే యోచనలో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. టెస్టు సిరీస్‌లో రాణిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ పరిమిత ఓవర్ల‌ జట్టులోకి వచ్చే అవకాశాలూ ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2020లో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్‌, ఇషాన్ కిషన్, నితీష్ రాణాలకు అవకాశం దక్కనుందట. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును ఎంపిక చేస్తారని సమాచారం.

బుమ్రాకు రెస్ట్

బుమ్రాకు రెస్ట్

తాజాగా ఓ బీసీసీఐ అధికారి మీడియాతో మాట్లాడారు. 'ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఇప్పటివరకు జస్ప్రీత్ బుమ్రా దాదాపు 180 ఓవర్లు బౌలింగ్ చేశాడు. నాలుగు టెస్టుల్లో 150 ఓవర్ల వరకు బంతులు విసిరాడు. మైదానంలో బుమ్రా ఎన్నో గంటలు గడిపాడు. ఈ నేపథ్యంలో మొతెరాలో రెండు టెస్టుల అనంతరం అతడికి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విశ్రాంతి ఇవ్వాలి. భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారితో పటు పేసర్లు టీ నటరాజన్‌, నవదీప్ సైనీ కూడా వైట్‌బాల్‌ జట్టులో ఉంటారు' అని బీసీసీఐ అధికారి తెలిపారు. గాయాలతో భువీ, షమీ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.

యాదవ్‌కు అవకాశం

యాదవ్‌కు అవకాశం

'వన్డే, టీ20 ఫార్మాట్లలో యుజ్వేంద్ర చహల్ స్లో బౌలర్‌గా ఉంటాడు. అయితే రవీంద్ర జడేజా అప్పటికీ కోలుకోకపోతే.. అశ్విన్‌కు అవకాశం ఇవ్వడం మంచి ఆలోచన. వికెట్ ‌కీపర్‌గా కేఎల్‌ రాహుల్ మా మొదటి ఎంపిక. రిషబ్ పంత్‌ కూడా ఫామ్‌లో ఉన్నాడు. అతడికి అవకాశాలు ఉన్నాయి. అయితే సంజు శాంసన్‌కు బదులుగా సూర్యకుమార్‌ యాదవ్‌ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి' అని సదరు బీసీసీఐ అధికారి చెప్పారు. యాదవ్‌కు ఇంగ్లండ్‌తో జరగనన్న టీ20 సిరీస్‌ కోసం పిలుపు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టును ఎంపిక చేసిన సమయంలో యాదవ్ పేరు వినిపించినప్పటికీ ఎంపిక కాలేకపోయాడు. ఇషాన్ కిషన్, నితీష్ రాణాలకు అవకాశం దక్కనుందని సమాచారం.

ఫామ్‌లో పంత్

ఫామ్‌లో పంత్

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లోనూ, ఇంగ్లండ్‌తో ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ అదరగొడుతుండడంతో ఇప్పుడు రిషబ్ పంత్‌ పేరు మార్మోగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పంత్‌కు చోటు లభించలేదు. అయితే నంబర్ 7లో ఆల్‌రౌండర్ అవసరం కావడంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయిన పంత్‌కు అవకాశం లభించింది. చివరి రెండు టెస్టుల్లోను అద్భుతంగా ఆడిన పంత్ భారత్ టెస్టు సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్టుల్లోనూ రాణిస్తున్నాడు. రెండు టెస్టుల్లో రెండు అర్ధ సెంచరీలు చేశాడు. దీంతో అతడికి అవకాశాలు ఉన్నాయి.

మార్చి 12 నుంచి టీ20లు

మార్చి 12 నుంచి టీ20లు

ప్రస్తుతం ఇంగ్లండ్‌తో భారత్ నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇప్పటికి రెండు టెస్టులు ముగియగా చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. ఇక ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 12 నుంచి 20 మధ్య జరగనుంది. అనంతరం పూణెలో మార్చి 23 నుంచి 28 మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగుతుంది.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పెను సంచలనం.. టాప్‌ సీడ్‌కు భారీ షాక్!!

Story first published: Wednesday, February 17, 2021, 11:29 [IST]
Other articles published on Feb 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X