For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పెను సంచలనం.. టాప్‌ సీడ్‌కు భారీ షాక్!!

Australian Open 2021: Karolina Muchova knocks out Ashleigh Barty to enters semi finals

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2021లో పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్‌ టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 25వ సీడ్‌ కరోలినా ముచోవా (చెక్) చేతిలో 6-1, 3-6, 2-6 తేడాతో ఓడిన బార్టీ టోర్నీ నుంచి వైదొలిగింది. దీంతో సొంత గడ్డపై ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ కావాలనే కల అలానే మిగిలిపోయింది. ఇక అద్భుత విజయం సాధించిన ముచోవా గ్రాండ్‌స్లామ్ సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించింది.

తొలి సెట్‌లో 6-1తో వెనుకబడిన చెక్ ప్లేయర్ ముచోవా.. రెండో సెట్‌లో ఫుంజుకొని 3-6తో సెట్‌ను కైవసం చేసుకుంది. ఇక కీలకమైన మూడో సెట్‌లోనూ ముచోవా అదే జోరు కొనసాగించి 2-6తో సెట్‌ను కైవసం చేసుకోవడంతో పాటు మ్యాచ్‌ను గెలుచుకొని సెమీస్‌కు ప్రవేశించింది. జెన్నిఫర్‌ బ్రాడీ, అన్‌సీడెడ్‌ జెస్సికా పెగులా మధ్య జరిగే మ్యాచ్‌ విజేతతో ముచోవా సెమీస్‌లో తలపడనుంది. 'మొదటి సెట్ ముగిసే సమయానికి ఓడిపోతా అనుకున్నా. కానీ రెండు, మూడో సెట్లలో పుంజుకున్నా. చాలా సంతోషంగా ఉంది. బార్టీ చాలా బాగాఆడింది. దాదాపుగా ఆమె తప్పులు చేయలేదు' అని ముచోవా పేర్కొంది.

మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో పదోసీడ్‌ సెరెనా విలియమ్స్‌ 6-3, 6-3తో సిమోనా హలెప్‌ (రొమేనియా)పై విజయం సాధించింది. సెరెనా.. సెమీస్‌లో నవోమీ ఒసాక (జపాన్‌)తో తలపడనుంది. క్వార్టర్స్‌లో ఒసాక 6-2, 6-2 తేడాతో సువీయ్‌ (చైనీస్‌ తైపీ)పై గెలిచింది. గత మ్యాచ్‌ల్లో బియాంక ఆండ్రెస్కూ, వోండ్రుసోవా లాంటి సీడెడ్లను కంగుతినిపించిన సువీయ్‌.. క్వార్టర్స్‌లో ఒసాకా జోరు ముందు నిలువలేకపోయింది.

ర‌ష్యా టెన్నిస్ క్రీడాకారుడు అస్ల‌న్ క‌ర‌త్సేవ్ కూడా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనం సృష్టించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీ ఫైన‌ల్లోకి ప్ర‌వేశించాడు. ఓపెన్ ఎరాలో అరంగేట్రం చేసిన గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే సెమీస్‌కు చేరిన తొలి టెన్నిస్ ప్లేయ‌ర్‌గా 27 ఏళ్ల అస్ల‌న్ రికార్డు సృష్టించాడు. క్వాలిఫై ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన అస్ల‌న్‌ 2-6, 6-4, 6-1, 6-2 స్కోర్‌తో క్వార్టర్స్‌లో దిమిత్రోవ్‌పై విజ‌యం సాధించాడు. సెమీస్‌లో టాప్‌ సీడ్ నోవాక్ జకోవిచ్‌తో అస్లాన్‌ తలపడనున్నాడు.

Story first published: Wednesday, February 17, 2021, 10:45 [IST]
Other articles published on Feb 17, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+