Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ వీడియో: జస్ప్రీత్‌ బుమ్రా ఒకేఒక్కడు.. ఆరుగురిలా బౌలింగ్‌!!

Jasprit Bumrah copies actions of six different bowlers during Mumbai Indians net session

దుబాయ్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 సీజన్‌ కోసం యూఏఈకి వెళ్లిన అన్ని ప్రాంఛైజీలు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక ఐపీఎల్ 13వ సీజన్‌కు ఇంకా దాదాపు పది రోజులే ఉండడంతో అన్ని జట్లు ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. సెప్టెంబర్‌ 19న అబుదాబి వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ క్రమంలో ముంబై సాధన మరింత తీవ్రతరం చేసింది. ఆటగాళ్లు నెట్ సెషన్‌లో కష్టపడుతున్నారు.

ఆరుగురిలా బౌలింగ్‌

ముంబై ఇండియన్స్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ప్రాక్టీస్‌ సెషన్‌లో ఓ ప్రత్యేకమైన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. మాజీ, ప్రస్తుత అంతర్జాతీయ బౌలర్లలో ఆరుగురి బౌలింగ్‌ యాక్షన్‌ను చేసి చూపించాడు. ఈ వీడియోను ముంబై ప్రాంచైజీ ట్విట్టర్ వేదికగా పంచుకొని ఎవరెవరి బౌలింగ్‌ను అతడు అనుకరించాడో గుర్తుపట్టమని అభిమానులను అడిగింది. దీనికి స్పందించిన ముంబై అభిమానులు అనేక మంది అంతర్జాతీయ బౌలర్ల పేర్లను కామెంట్లలో పేర్కొంటున్నారు.

 కుంబ్లే బౌలింగ్‌ను దించేశాడుగా

కుంబ్లే బౌలింగ్‌ను దించేశాడుగా

మునాఫ్ పటేల్, గ్లెన్ మెక్‌గ్రాత్, మిచెల్ స్టార్క్, కేదార్ జాదవ్, శ్రేయాస్ గోపాల్ మరియు అనిల్ కుంబ్లేలా జస్ప్రీత్‌ బుమ్రా ప్రాక్టీస్‌ సెషన్‌లో బౌలింగ్ చేశాడు. అందరిలోకెల్ల అనిల్ కుంబ్లే బౌలింగ్‌ను బుమ్రా అచ్చం దించేశాడు. కుంబ్లే లానే బౌలింగ్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. తమకు తెలిసిన బౌలర్ల పేర్లను ఫాన్స్ పోస్ట్ చేస్తున్నారు. అయితే కొందరు సరైన సమాధానాలే చెప్పినా.. మరికొందరు మాత్రం తప్పుగా చెపుతున్నారు.

డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ హోదాలో

డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ హోదాలో

గతేడాది ముంబై ఇండియన్స్‌ జట్టు నాలుగోసారి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ హోదాలో బరిలోకి దిగనుంది. మరోవైపు ఆటగాళ్ల ఆరోగ్య భద్రత విషయమై ఆ ఫ్రాంఛైజీ గట్టి చర్యలు తీసుకుంటోంది. ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమైన ఉంగరాలు అందించింది. అందరూ కచ్చితంగా వాటిని ధరించాల్సి ఉంటుంది. దాంతో ఎవరైనా అనారోగ్యం బారిన పడినా, కరోనా లక్షణాలు లేకుండా వైరస్‌ బారిన పడినా శరీరంలో చోటుచేసుకునే మార్పులను గమనించి వెంటనే అప్రమత్తం చేస్తుంది. దాంతో వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే వీలు కలుగుతుంది.

'అభిమానులారా ఆందోళన అవసరం.. కష్టాల్లోనూ నెట్టుకొచ్చిన కెప్టెన్ మనకు ఉన్నాడు'

Story first published: Tuesday, September 8, 2020, 15:22 [IST]
Other articles published on Sep 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+