Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాషింగ్టన్ సుందర్ నాటౌట్.. అంపైర్‌ది తప్పుడు నిర్ణయం: జస్‌ప్రీత్ బుమ్రా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో అంపైర్ల నిర్ణయాలపై టీమిండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా థర్డ్ అంపైర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని అసహనం వ్యక్తం చేశాడు. గత మ్యాచ్‌లో స్నికో‌ను పరిగణలోకి తీసుకోని థర్డ్ అంపైర్.. తాజా మ్యాచ్‌లో తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వికెట్‌ విషయం‌లో బుమ్రా ఇలా స్పందించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం సిడ్నీ వేదికగా ప్రారంభమైన ఆఖరి టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసింది. ప్యాట్ కమిన్స్ వేసిన 66వ ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్ వివాదాస్పద రీతిలో క్యాచ్ ఔటయ్యాడు. కమిన్స్ వేసి షార్ట్ పిచ్ బాల్‌ను థర్డ్ మ్యాన్ దిశగా సుందర్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్‌ను మిస్సైన బంతి కీపర్ అలెక్స్ క్యారీ చేతిలో పడింది. వెంటనే ఆసీస్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. అయితే ఫీల్డ్ అంపైర్లు నాటౌటివ్వగా.. ఆసీస్ రివ్యూ తీసుకుంది.

Jasprit Bumrah Clashes With Umpire After Washington Sundar s Debatable Dismissal In IND vs AUS 5th Test

థర్డ్ అంపైర్ జోయల్ విల్సన్.. పలు కోణాల్లో టీవీ రిప్లేలను పరిశీలించాడు. బంతి.. వాషింగ్టన్ సుందర్ గ్లోవ్‌ను తాకిందా? లేదా? అని స్నీకో మీటర్‌ సాయంతో పరీక్షించాడు. ఒక కోణంలో తాకనట్లుగా.. మరో కోణంలో తాకినట్లుగా స్పైక్ వచ్చింది. సరైన ఆధారం లేకున్నా.. వాషింగ్టన్ సుందర్ ఔట్ అంటూ ప్రకటించాడు. ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. నాన్ స్ట్రైకర్‌గా ఉన్న బుమ్రా.. వెంటనే ఫీల్డ్ అంపైర్లతో తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

బుమ్రా అసంతృప్తి..
'గత మ్యాచ్‌లో స్నీకో ఆధారంగా నిర్ణయం తీసుకోలేదు. ఈ మ్యాచ్‌లో మాత్రం స్నీకోలో స్పైక్ వచ్చిందని ఔటిచ్చాడు.'అని బుమ్రా అనడం స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యింది. గత మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్.. జోయల్ విల్సన్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. స్నీకోలో స్పైక్ లేకున్నా.. డివియేషన్ ఉందని ఔటిచ్చాడు.

భారత్ 185 ఆలౌట్..
ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(98 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 40), రవీంద్ర జడేజా(95 బంతుల్లో 3 ఫోర్లతో 26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.చివర్లో బుమ్రా(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22) విలువైన పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్బోలాండ్(4/31) నాలుగు వికెట్లతో చెలరేగగా.. మిచెల్ స్టార్క్(3/49) మూడు వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్‌(2/37) రెండు వికెట్లు దక్కాయి. నాథన్ లయన్ ఓ వికెట్ తీసాడు.

అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ప్రారంభించగా.. ఉస్మాన్ ఖవాజా(2)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.

Story first published: Friday, January 3, 2025, 16:25 [IST]
Other articles published on Jan 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+