టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కళ్లు చెదిరే యార్కర్‌తో ఆకట్టుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో బుమ్రా స్టన్నింగ్ యార్కర్‌తో ఔరా అనిపించాడు. అతని సూపర్ యార్కర్‌కు నిలకడగా ఆడిన జోషువా లిటిల్(14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని బుమ్రా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో యార్కర్‌గా సంధించగా.. జోషువా లిటిల్ బంతి టచ్ లేకపోయాడు. దాంతో బంతిని మిడిల్ స్టంప్‌ను లేపేసింది. ఈ స్టన్నింగ్ డెలివరీకి జోషువా లిటిల్ బిత్తరపోయాడు. ఈ స్టన్నింగ్ యార్కర్‌పై కామెంటేర్లు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మ్యాచ్‌కే హైలైట్ అంటూ కొనియాడారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో గెరాత్ డెలానీ(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26), జోష్ లిటిల్(13 బంతుల్లో 2 ఫోర్లతో 14), కర్టిస్ కాంఫెర్(8 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 12) మాత్రమే రెండెంకల స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
పిచ్ నుంచి లభించిన సహకారంతో భారత బౌలర్లు.. హార్దిక్ పాండ్యా(3/27), జస్‌ప్రీత్ బుమ్రా(2/6), అర్ష్ దీప్ సింగ్(2/35), మహమ్మద్ సిరాజ్(1/13), అక్షర్ పటేల్(1/3) నిప్పులు చెరిగారు. డ్రాప్ ఇన్ పిచ్‌పై పరుగులు చేసేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు.