Jasprit Bumrah:లార్డ్స్ టెస్ట్‌లో యార్కర్ల కింగ్ చెత్త రికార్డు.. రాకాసి బౌన్సర్లతో అండర్సన్‌పై దాడి!

లండన్: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాడు. ఓ టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన భారత బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఈ యార్కర్ల కింగ్ తేలిపోయాడు. 26 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా..79 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అంతేకాకుండా 13 నో బాల్స్ వేశాడు. 2002లో జహీర్‌ఖాన్ (విండీస్‌పై) తర్వాత మరే భారత బౌలర్ ఇన్ని నోబాల్స్ వేయలేదు. ఫస్ట్ టెస్ట్‌లో 9 వికెట్లు తీసి లయను అందుకున్న బుమ్రా రెండో టెస్ట్‌లో మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయాడు.

రాకాసి బౌన్సర్లతో దాడి..
ముఖ్యంగా శనివారం అండర్సన్‌కు బుమ్రా వేసిన ఓవర్ ప్రమాదకరంగా ముగిసింది. ఇంగ్లండ్ ప్రధాన పేసర్‌ను గాయపర్చాలనే ఉద్దేశం ఉందా? లేదా? తెలీదు కానీ 11వ నంబర్ బ్యాట్స్‌మన్‌పై అతను వరుసగా షార్ట్ పిచ్ బంతులు సంధించాడు. తొలి బంతి హెల్మెట్‌కు తగలడంతో బిత్తరపోయిన అండర్సన్ 'కన్‌కషన్ టెస్ట్' కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా బుమ్రా తగ్గలేదు. తర్వాతి బంతి పొత్తికడుపుపై బలంగా తాకగా, మరో బంతి పక్కటెముల మీదకు దూసుకొచ్చింది. ఈ క్రమంలో బుమ్రా ఒకే ఓవర్లో 4 నోబాల్స్ సహా మొత్తం 10 బంతులు విసిరాడు!

వికెట్లు తీయలేదనే..
ఇక వికెట్లు తీయలేదనే అసహనంలో ఉన్న బుమ్రా మరింత వేగంగా బంతులు వేయాలని ఈ తప్పిదం చేశాడని భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ అన్నాడు. ముంబై ఇండియన్స్ కోచ్‌గా బుమ్రా బౌలింగ్ తీరును దగ్గరగా చూసిన అతను నో బాల్స్ వేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు. వికెట్లు తీయాలనే కసిలోనే బుమ్రా తన రన్నప్ మిస్సయ్యాడని, ఆ క్రమంలోనే వరుసగా నోబాల్స్ వేసాడని పేర్కొన్నాడు.
'ఇలాంటి తప్పిదాలను వివరించడం కష్టమే. ఎందుకంటే ఇది రనప్‌కు సంబంధించినది. రనప్ మిస్సయినప్పుడే నో బాల్స్ పడుతాయి. వికెట్లు రాలేదనే అసహనంలో ఉన్న బుమ్రా మరింత వేగంగా బంతుల వేయాలని భావించాడు. ఎక్స్‌ట్రా ఎఫర్ట్ ఇచ్చి వికెట్లు తీయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అతని రనప్ మిస్సై నోబాల్స్ వేసాడు. అండర్సన్, బుమ్రా మధ్య జరిగిన పోరు ఆసక్తికరంగా సాగింది.'అని క్రిక్‌బజ్‌తో జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్‌కు ఆధిక్యం..
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు 27 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 119/3తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (321 బంతుల్లో 18 ఫోర్లతో 180 నాటౌట్) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా... జానీ బెయిర్‌స్టో (107 బంతుల్లో 7 ఫోర్లతో 57 ) రాణించాడు. సిరాజ్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట చివరి ఓవర్ చివరి బంతికి అండర్సన్‌ను షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఆట ముగిసింది.
అయితే ఇంగ్లండ్‌ను మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలగడమే మూడో రోజు ఆటలో భారత్‌కు ఊరటనిచ్చే అంశం. తొలి రెండు సెషన్లలో ఇంగ్లండ్ జోరు చూపించినా... చివరి సెషన్లో చెలరేగిన భారత బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. సహచరుల నుంచి చెప్పుకోదగ్గ సహకారం లభించకపోయినా కెప్టెన్ జో రూట్ అద్భుత బ్యాటింగ్‌తో నిలవడం శనివారం ఆటలో హైలైట్ కాగా... టీమిండియా తరఫున సిరాజ్, ఇషాంత్ తమ ముద్ర చూపించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications