For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జస్‌ప్రీత్ బుమ్రా డబుల్ సెంచరీ..!

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. 8484 బంతుల్లోనే బుమ్రా 200 టెస్ట్ వికెట్లు సాధించాడు.

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. ఆస్ట్రేలియా డేంజరస్ బ్యాటర్, బర్త్‌డే బాయ్ ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా 200వ టెస్ట్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

Jasprit Bumrah becomes fastest Indian pacer to bag 200 wickets in 8484 balls during IND vs AUS 4th Test

ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ రికార్డ్‌ను బుమ్రా అధిగమించాడు. కపిల్ దేవ్ 50 టెస్ట్‌ల్లో 200 వికెట్లు పడగొడితే బుమ్రా 44 టెస్ట్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. బంతుల పరంగా అత్యంత త్వరగా 200 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ఈ జాబితాలో వాఖర్ యూనిస్(7,725 బంతులు), డేల్ స్టెయిన్(7,848), కగిసో రబడా(8,153).. బుమ్రా(8484 బంతులు) కంటే ముందున్నారు.

అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన భారత పేసర్లలో బుమ్రా ఆరో స్థానంలో నిలిచాడు. 434 వికెట్లతో కపిల్ దేవ్ అగ్రస్థానంలోఉండగా.. జహీర్ ఖాన్(311), ఇషాంత్ శర్మ(311), జవగళ్ శ్రీనాథ్(236), మహమ్మద్ షమీ(229), జస్‌ప్రీత్ బుమ్రా(201) కంటే ముందున్నారు. అతి త్వరలోనే బుమ్రా ఈ రికార్డులన్నీ చెరిపేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆసీస్ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా రికార్డ్ సాధించిన విషయం తెలిసిందే.

105 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆసీస్.. బుమ్రా నిప్పులు చెరగడంతో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సామ్ కోన్‌స్టాస్, అలెక్స్ క్యారీలను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్‌లను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. డేంజరస్ స్మిత్(13), ఉస్మాన్ ఖవాజా(21)లను సిరాజ్ ఔట్ చేయడంతో ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 474 పరుగుల భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం భారత్.. నితీష్ కుమార్ రెడ్డి శతకంతో తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసింది.

Story first published: Sunday, December 29, 2024, 9:08 [IST]
Other articles published on Dec 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+