Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన బుమ్రా.. ఓడినా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్!

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో టీమిండియా కోల్పోయినా.. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అందుకున్నాడు. ఈ సిరీస్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో 13.06 యావరేజ్‌తో 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత ఉండటం విశేషం.

రెండు సార్లు 9 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఆస్ట్రేలియాతో అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచిన బుమ్రా.. బిషన్ సింగ్ బేడీ(31 వికెట్ల) రికార్డ్‌ను అధిగమించాడు.

Jasprit Bumrah adjudged Player of the Series despite India losing 3-1 to Australia

ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఓడిన జట్ల ఆటగాళ్లకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్స్ ఇస్తారు. ద్వైపాక్షి సిరీస్‌ల్లో గెలిచిన జట్టుకు చెందిన ఆటగాళ్లే ఈ అవార్డ్ అందజేస్తారు. కానీ ఈ సిరీస్‌లో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శనకు ఫిదా అయిన నిర్వాహకులు అతనికి ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ అందజేశారు. ఆసీస్ గడ్డపై ఓ టెస్ట్‌ సిరీస్‌లో 20 వికెట్ల కంటే ఎక్కువ పడగొట్టిన బౌలర్లలో రెండో అత్యుత్తమ బెస్ట్ యావరేజ్ కలిగిన బౌలర్‌గా నిలిచాడు. రిచర్డ్ హడ్లీ( 1985లో 12.15 సగటు) బుమ్రా కంటే ముందున్నాడు.

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా గడ్డపై మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచిన తొలి భారత ఆటగాడిగానూ బుమ్రా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్ పర్యటన 2022-23లో బుమ్రా ఐదు టెస్ట్‌ల్లో 23 వికెట్లు తీసి హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ అందుకున్నాడు. గతేడాది సౌతాఫ్రికా గడ్డపై రెండు టెస్ట్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. సఫారీ గడ్డపై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్ గెలుచుకున్న తొలి భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మూడు సెనా దేశాలపై ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అందుకున్న తొలి భారత ఆటగాడు కూడా బుమ్రానే.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న రెండో పేసర్ జస్‌ప్రీత్ బుమ్రానే. 2007-08లో ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ తొలిసారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. తొలి టెస్ట్‌లో టీమిండియాను నడిపించిన బుమ్రా.. చారిత్రాత్మక విజయాన్నందించాడు. చివరి టెస్ట్‌లోనూ జట్టును నడిపించిన బుమ్రా వెన్ను గాయంతో మధ్యలోనే తప్పుకున్నాడు. బుమ్రా గైర్హాజరీ టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది.

సిడ్నీ వేదికగా ఆదివారం ముగిసిన ఆఖరి టెస్ట్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది.

Story first published: Sunday, January 5, 2025, 15:21 [IST]
Other articles published on Jan 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+