టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్స్‌ను సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత పేసర్‌గా చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు టెస్ట్‌ల్లో బుమ్రా 21 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
ఈ ప్రదర్శనతో బుమ్రా తాజాగా వెల్లడించిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. 904 రేటింగ్ పాయింట్స్‌తో టాప్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. తన కెరీర్‌లో బుమ్రా 900 ప్లస్ రేటింగ్ పాయింట్స్ అందుకోవడం ఇదే తొలిసారి. భారత్ నుంచి మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం 904 రేటింగ్ పాయింట్స్ అందుకున్నాడు. 2016లో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ తర్వాత అశ్విన్ ఈ పాయింట్స్ సాధించాడు. 8 ఏళ్ల తర్వాత బుమ్రా తాజాగా ఈ ఫీట్ అందుకున్నాడు. ఓవరాల్‌గా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 900 పాయింట్లు ధాటిన 26వ ప్లేయర్‌గా బుమ్రా నిలిచాడు.

తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కగిసో రబడా, జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్, రవిచంద్రన్ అశ్విన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రవీంద్ర జడేజా 10వ స్థానంలో ఉన్నాడు.
బ్యాటింగ్ విభాగంలో టీమిండియా యువ ఓపెన్ యశస్వి జైస్వాల్ ఓ స్థానం దిగజారి ఐదో స్థానంలో నిలిచాడు. జోరూట్, హ్యారీ బ్రూక్, కేన్ విలియమ్సన్, ట్రావిస్ హెడ్ టాప్-4 ప్లేస్‌ల్లో నిలిచారు. భారత్‌తో వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసిన ట్రావిస్ హెడ్ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకున్నాడు. రిషభ్ పంత్ రెండు స్థానాలు దిగజారి 11వ స్థానంలో నిలిచాడు.
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ముగియగా.. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. గబ్బా వేదికగా జరిగిన గత టెస్ట్ వర్షం కారణంగా డ్రా అయ్యింది. మెల్ బోర్న్ వేదికగా గురువారం నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది.