ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భారీ ధర పలకడంపై ఆ జట్టు మాజీ క్రికెటర్ జాసన్ గిల్లేస్పీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఓ టెస్ట్ బౌలర్‌ను అంత ధర పెట్టి కొనడం ఏంటో అర్థం కావడం లేదన్నాడు. దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరిగిన మెగా వేలంలో కమిన్స్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. దాంతో అతని ధర అమాంతం పెరిగింది. చివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది.
ప్యాట్ కమిన్స్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతని కోసం భారీ ధరను వెచ్చించింది.
ఓ రెడియో చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాసన్ గిలేస్పీ.. ప్యాట్ కమిన్స్ భారీ ధర పలకడం స్పందించాడు.

'ప్యాట్ కమిన్స్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ బౌలర్. అందులో ఎటువంటి సందేహం లేదు. అదే విధంగా మంచి కెప్టెన్ కూడా. కానీ టీ20లకు అతను ఏ మాత్రం సరిపోడు. టీ20ల్లో అతనికి మంచి రికార్డు కూడా లేదు. కమిన్స్ ఓ టెస్ట్ ఫార్మాట్ ప్లేయర్. టెస్ట్ క్రికెట్‌లో అతనికి తిరుగులేదు. కానీ టీ20లు అతనికి సెట్ అవ్వవు. సన్‌రైజర్స్ హైదరాబాద్ అతని కోసం భారీ ధర ఖర్చు చేసి బ్లండర్ మిస్టేక్ చేసింది.'అని జాసన్ గిల్లేస్పీ అభిప్రాయపడ్డాడు.
'ప్యాట్ కమిన్స్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ బౌలర్. అందులో ఎటువంటి సందేహం లేదు. అదే విధంగా మంచి సారథి కూడా. కానీ టీ20లకు అతను సరిపోడు. టీ20లో మంచి రికార్డులు కూడా లేవు. నా వరకు అయితే కమ్మిన్స్ టెస్ట్ ఫార్మాట్ బౌలర్. టెస్ట్ క్రికెట్ అయితే అతనికి వెన్నతో పెట్టిన విద్య'అని జాసన్ గిల్లేస్పీ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్‌లో కమిన్స్ ఇప్పిట వరకు 42 మ్యాచ్‌లు ఆడి 45 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2020 వేలంలో కేకేఆర్ కమిన్స్‌ను రూ. 15.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అంతర్జాతీయ షెడ్యూల్ నేపథ్యంలో కమిన్స్ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు వన్డే ప్రపంచకప్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచకప్‌లో ఆసీస్‌ను విజేతగా నిలబెట్టడంతో అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఆసీస్‌కు చెందిన మిచెల్ స్టార్క్ కూడా రూ. 24.75 కోట్లు భారీ ధర పలికాడు. అతన్ని కేకేఆర్ రికార్డు ధర పెట్టి కొనుగోలు చేసింది.