Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్.. చిందేసిన అతని లవర్!(వీడియో)

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. భారీ సిక్స్‌లతో టీమిండియా విజయాన్ని సునాయసం చేశాడు. అతను కొట్టిన 101 మీటర్ల భారీ సిక్సర్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అయితే ఈ సిక్సర్‌కు అతని ప్రియురాలుగా ప్రచారం జరుగుతున్న బ్రిటిష్ సింగ్ జాస్మిన్ వాలియా ఎగిరి గంతేయడం చర్చనీయాంశమైంది.

అంతేకాకుండా హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనకు జాస్మిన్ వాలియా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌కు తన స్నేహితులతో కలిసి హాజరైన జాస్మిన్ వాలియా.. వీఐపీ లాంజ్‌లో కూర్చొని మ్యాచ్‌ను ఆస్వాదించింది. నటాషా స్టాంకోవిచ్‌తో విడాకుల అనంతరం హార్దిక్ పాండ్యా.. జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఈ ఇద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ టీమిండియా మ్యాచ్‌లకు జాస్మిన్ వాలియా హాజరవ్వడం ఈ వార్తలకు బలం చేకూర్చింది.

Jasmin Walia Jumps With Joy After Hardik Pandya Smashes A 101-Meter Six During IND vs AUS Semis

ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. మరోసారి విరాట్ కోహ్లీ(98 బంతుల్లో 5 ఫోర్లతో 84) అసాధారణ బ్యాటింగ్‌తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 73), అలెక్స్ క్యారీ(57 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(3/48) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/49), రవీంద్ర జడేజా(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 48.1 ఓవర్లలో 267 పరుగులు చేసి గెలుపొందింది. సెంచరీ చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 3 ఫోర్లతో 45), కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 28) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

Story first published: Wednesday, March 5, 2025, 21:30 [IST]
Other articles published on Mar 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+