Asia Cup 2025: టీమిండియా మేనేజర్‌గా జనసేన ఎమ్మెల్యే కొడుకు!
ఆసియా కప్ 2025 బరిలోకి దిగే భారత జట్టు మేనేజర్‌గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ పీవీఆర్ ప్రశాంత్ ఎంపికయ్యారు. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 జరగనుండగా.. టీమిండియా వ్యవహారాలను పీవీఆర్ ప్రశాంత్ పర్యవేక్షించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరానికి చెందిన ప్రశాంత్.. వెస్ట్ గోదావరి క్రికెట్ టీమ్ తరఫున క్రికెట్ ఆడాడు. ప్రశాంత్ తండ్రి భీమవరం జనసేన ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ రామంజనేయులు పులపర్తి. మాజీ మంత్రి, భీమ్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావుకు అల్లుడు. 1997లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు విజయవాడ మాజీ మేయర్ డీవీ సుబ్బారావు మేనేజర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత మరో ఆంధ్ర వ్యక్తి టీమిండియా మేనేజర్‌గా ఎంపికవ్వడం ఇదే తొలిసారి.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన భారత జట్టుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) సెక్రటరీ దేవ్‌రాజ్ మేనేజర్‌గా వ్యవహరించాడు. ఐపీఎల్ 2025 అనంతరం హెచ్‌సీఏ నిధుల గోల్‌మాల్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు.
ఆసియా కప్ 2025 టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, ఓమన్, యూఏఈలు బరిలోకి దిగుతున్నాయి. సెప్టెంబర్ 10 యూఏఈతో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. 14న పాకిస్థాన్‌తో హైఓల్టెజ్ మ్యాచ్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications