రాణించిన రహానే, విహారి.. భారత్, వెస్టిండీస్ ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా

కూలిడ్జ్: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు చేజిక్కించుకున్న భారత్.. టెస్టు సిరీస్‌నూ సొంతం చేసుకునేందుకు మార్గం సుగమం చేసుకుంది. అసలు పోరుకు ముందు వెస్టిండీస్ ఎ జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టి చివరకు డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం (162 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) చేసాడు.

రాణించిన హానే, విహారి
ఓవర్‌నైట్ స్కోర్ 84/1తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 78 ఓవర్లకు 188/5 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓపెనర్ రహానే, హనుమ విహారి (125 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. అకిమ్ ఫ్రేజర్ బౌలింగ్‌కు భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 15 పరుగుల వ్యవధిలో రిషభ్ పంత్ (19), రవీంద్ర జడేజా (9), రహానే ఔటయ్యారు. సాహా (14 నాటౌట్), అశ్విన్ (10) పరుగులు చేసాక భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 116 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని విండీస్ ముందు 305 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ ఎ 21 ఓవర్లు ఆడి మూడు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరుజట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫలితం రాకున్నా.. భారత ఆటగాళ్లకు మాత్రం చక్కటి ప్రాక్టీస్ లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్ బుమ్రా.. స్పిన్నర్లు అశ్విన్, జడేజా తలో వికెట్ తీశారు.
టేబుల్ టాపర్ జైపూర్‌కు యూపీ షాక్.. దీపక్ హుడా పోరాటం వృధా

ఆల్‌రౌండ్ షో
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 297 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఛతేశ్వర పుజారా (187 బంతుల్లో 100 రిటైర్డ్ నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్) సెంచరీ, రోహిత్ శర్మ (68) రాణించారు. రాహుల్ (36), విహారి (37), రిషభ్‌పంత్ (33) పరుగులు చేశారు. అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. కావెం హాడ్జ్ (51; 100 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీ చేసాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ఇషాంత్‌శర్మ, ఉమేశ్ యాదవ్, కుల్‌దీప్ యాదవ్ తలో మూడు వికెట్లు తీశారు. ఈనెల 22 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications