Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన జమ్మూ కశ్మీర్.. 67 ఏళ్లలో ఇదే తొలిసారి..!

జమ్మూ కశ్మీర్ రంజీ టీమ్ చరిత్ర సృష్టించింది. 67 ఏళ్ల రంజీ ట్రోఫీ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఫైనల్ చేరింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో భాగంగా బెంగాల్‌తో జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా రాణించిన జమ్మూ కశ్మీర్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేసింది. సుదీప్ కుమార్ ఘారమి(146) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు ఆలౌటైంది. భారత పేసర్ మహహ్మద్ షమీ(8/90) కెరీర్ బెస్ట్ ప్రదర్శన కనబర్చాడు. అబ్దుల్ సమద్(82), పరాస్ డోగ్రా(58) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Jammu and Kashmir cricket team End 67-Year Ranji Trophy Drought With Historic Win Over Bengal cricket team

అయితే రెండో ఇన్నింగ్స్‌లో బెంగాల్ 99 పరుగులకే కుప్పకూలింది. షాబాజ్ అహ్మద్(24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జమ్మూ కశ్మీర్ బౌలర్లు ఔకిబ్ నమీ(4/36), సునీల్ కుమార్(4/27) నాలుగేసి వికెట్లతో బెంగాల్ పతనాన్ని శాసించారు. యుద్వీర్ సింగ్ చరక్ 2 వికెట్లు పడగొట్టాడు.

నాలుగో రోజు ఆటలో జమ్మూ కశ్మీర్ 4 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అబ్దుల్ సమద్(30 నాటౌట్), శుభమ్ పుండిర్(27) రాణించారు. బెంగాల్ బౌలర్లలో ఆకాశ్ దీప్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ ఒక వికెట్ పడగొట్టాడు.

మరో సెమీఫైనల్లో కర్ణాటక, ఉత్తరఖాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కర్ణాటక 770 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆ జట్టే ఫైనల్ చేరే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 24 నుంచి రంజీ ట్రోఫీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో బెంగాల్‌తో పాటు కర్ణాటక తలపడనున్నాయి.

సంక్షిప్త స్కోర్లు

బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 328

జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ 302

బెంగాల్ రెండో ఇన్నింగ్స్ 99

జమ్మూ కశ్మీర్ 126/4

Story first published: Wednesday, February 18, 2026, 16:38 [IST]
Other articles published on Feb 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+