ఇంగ్లండ్ వికెట్ కీపర్ జెమీ స్మిత్ చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టుపై సెంచరీ సాధించిన ఇంగ్లండ్ వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో జెమీ స్మిత్ సెంచరీ సాధించాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో చెలరేగిన జెమీ స్మిత్.. మూడో రోజు ఆటలో లంచ్ సెషన్‌కు ముందు జడేజా ఓవర్‌లో రెండు బౌండరీలు బాది 80 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ శతకంతో జెమీ స్మిత్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్‌పై టెస్ట్ సెంచరీ బాదిన ఇంగ్లండ్ వికెట్ కీపర్ జెమీ స్మిత్ నిలిచాడు. 2011లో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ మ్యాట్ ప్రియర్(103 నాటౌట్) చివరిసారిగా భారత్‌పై శతకం సాధించాడు. ఇప్పటి వరకు భారత్‌పై నలుగురు ఇంగ్లండ్ వికెట్ కీపర్లు మాత్రమే టెస్ట్ సెంచరీలు నమోదు చేశారు. 1952లో లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్‌గా గాడ్‌ఫ్రె ఇవాన్స్(104) భారత్‌పై శతకం సాధించగా.. 1996లో లార్డ్స్‌లోనే జాక్ రస్సెల్(124) సెంచరీ సాధించాడు.
గాడ్‌ఫ్రే ఎవాన్స్ (104), లార్డ్స్, 1952
జాక్ రస్సెల్ (124), లార్డ్స్, 1996
మాట్ ప్రయార్ (103*), లార్డ్స్, 2011
జేమీ స్మిత్ (102*), బర్మింగ్‌హామ్, 2025

ఇంగ్లండ్ తరఫున టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన నాలుగో బ్యాటర్‌గా జెమీస్మిత్ నిలిచాడు. ఈ క్రమంలో అతను హ్యారీ బ్రూక్ రికార్డ్‌ను సమం చేశాడు. ఈ జాబితాలో గిల్బెర్ట్ జెస్సాప్ అగ్రస్థానంలో ఉన్నాడు. 1902లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అతను 76 బంతుల్లో సెంచరీ సాధించాడు. 2002లో న్యూజిలాండ్‌పై జానీ బెయిర్ స్టో 77 బంతుల్లో, 2022లో పాకిస్థాన్‌పై హ్యారీ బ్రూక్ 80 బంతుల్లో సెంచరీ సాధించారు. 2015లో న్యూజిలాండ్‌పై బెన్ స్టోక్స్ 85 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు.
76 గిల్బర్ట్ జెస్సాప్ vs ఆస్ట్రేలియా, ది ఓవల్ 1902
77 జానీ బెయిర్‌స్టో vs న్యూజిలాండ్, ట్రెంట్ బ్రిడ్జ్ 2022
80 హ్యారీ బ్రూక్ vs పాకిస్తాన్, రావల్పిండి 2022
80 జేమీ స్మిత్ vs ఇండియా, ఎడ్జ్‌బాస్టన్ 2025 *
85 బెన్ స్టోక్స్ vs న్యూజిలాండ్, లార్డ్స్ 2015
77/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగింది. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో జోరూట్(22), బెన్ స్టోక్స్(0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. ఈ ఆరంభాన్ని భారత బౌలర్లు అందిపుచ్చుకోలేకపోయారు. ముఖ్యంగా ప్రసిధ్ కృష్ణ పేలవ బౌలింగ్‌తో టీమిండియాకు నష్టం చేశాడు. క్రీజులో సెట్ అయిన హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్.. దూకుడుగా బ్యాటింగ్ చేశారు. భారత బౌలర్లను చెడుగుడు ఆడారు. దాంతో ఇంగ్లండ్ 249/5 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. తొలి సెషన్‌లో ఇంగ్లండ్ 27 ఓవర్లలో 172 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోర్ చేసింది.