Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదేం క్రీడాస్పూర్తి.. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ సెంచరీ చేజార్చేందుకు ఆస్ట్రేలియా బౌలర్ కుట్ర.!

James Vince opens up after Andrew Tye’s wide controversy in BBL 2020-21 Qualifier

సిడ్నీ: ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ సెంచరీ చేయకుండా ఉండేందుకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ టై చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్, పెర్త్ స్కాచర్స్ మధ్య శనివారం క్వాలిఫయర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ విజయానికి ఒక పరుగు అవసరమైన దశలో ఓపెనర్ జేమ్స్ విన్స్ (53 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 98 నాటౌట్) సెంచరీకి 2 పరుగుల దూరంలో ఉండగా.. ఆ అవకాశాన్ని చేజార్చేందుకు పెర్త్ బౌలర్ ఆండ్రూ టై విరుద్దంగా వైడ్ విసిరాడు. దాంతో మ్యాచ్ ముగిసిపోయింది. తమ జట్టు గెలిచినా.. విన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు.

ఇదేం క్రీడాస్పూర్తి..?

క్రీడాస్పూర్తికి విరుద్దంగా వ్యవహరించిన ఆండ్రూ టైపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. 2010లోనూ ఇదే తరహాలో వీరేంద్ర సెహ్వాగ్‌ (99 నాటౌట్) సెంచరీని చేజార్చేందుకు శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సూరజ్ రణదీవ్ క్రీడాస్ఫూర్తి తప్పి నోబాల్ విసిరాడు. ఆ సమయంలో టీమిండియా విజయానికి ఒక పరుగు దూరంలో ఉంది. దాంతో.. సెహ్వాగ్‌కు సెంచరీ మిస్ అయ్యింది. అప్పట్లో క్రికెట్ అభిమానులు రణదీవ్‌ను తప్పుబట్టారు.

టార్గెట్ 167

టార్గెట్ 167

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆ జట్టులో జోష్ ఇంగ్లీష్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం చేజింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ జట్టులో ఓపెనర్లు జేమ్స్ విన్స్, జోష్ ఫిలిప్పీ (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) దూకుడుగా ఆడేశారు. తొలి వికెట్‌కి 8.5 ఓవర్లలోనే 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. విజయానికి బాటలు వేసింది. అయితే.. హాఫ్ సెంచరీ ముంగిట ఫిలిప్పీ ఔటవ్వగా.. అనంతరం వచ్చిన డేనియల్ హగ్గీస్ ( 21 బంతుల్లో 1 ఫోర్ 21 నాటౌట్)తో కలిసి జేమ్స్ విన్స్ చివరి వరకూ జోరుని కొనసాగించాడు.

ఉద్దేశ పూర్వకంగానే..

ఉద్దేశ పూర్వకంగానే..

168 పరుగుల లక్ష్య ఛేదనలో 17 ఓవర్లు ముగిసే సమయానికి సిడ్నీ సిక్సర్స్ 167/1తో నిలవగా.. జేమ్స్ విన్స్ 98 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దాంతో.. 18వ ఓవర్‌లో ఆండ్రూ టై బౌలింగ్‌కి రాగా.. బౌండరీ కొట్టడం ద్వారా సెంచరీని పూర్తి చేసుకుని మ్యాచ్‌ను కూడా ముగించాలనే ఆలోచనలో జేమ్స్ విన్స్ ఉన్నట్లు కనిపించింది. ఆ ప్లాన్‌లో భాగంగానే 17వ ఓవర్‌లో చివరి మూడు బంతుల్ని డేనియల్ ఎలాంటి పరుగు తీయకుండా డాట్ చేశాడు. కానీ.. 18వ ఓవర్‌ తొలి బంతినే లెగ్ సైడ్ దిశగా ఆండ్రూ టై వైడ్‌గా విసిరాడు. దాంతో.. జేమ్స్ విన్స్‌ ఆ బంతిని కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు.

అది టైకే తెలియాలి..

అది టైకే తెలియాలి..

ఈ ఘటనపై మ్యాచ్ అనంతరం మాట్లాడిన జేమ్స్ విన్స్.. ఆ వైడ్ ఉద్దేశపూర్వకంగానే వేసాడా? లేక అనుకోకుండా జరిగిందా? అనేది ఆండ్రూ టై ఒక్కడికే తెలుసన్నాడు. తాను మాత్రం టై కావాలనే వైడ్ వేసాడని అనుకోవడం లేదన్నాడు. అయితే ఆ సెంచరీ చేసుంటే బాగుండేదని, ఏది ఏమైనా తమ జట్టు ఫైనల్‌కు చేరడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఆండ్రూ టై ప్రవర్తించిన తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతను ఉద్దేశపూర్వకంగానే వైడ్ వేసాడనే విషయం స్పష్టంగా తెలుస్తోందని, ఇలా చాలా దారుణమని విమర్శించాడు.

Story first published: Sunday, January 31, 2021, 15:23 [IST]
Other articles published on Jan 31, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+